భూతవైద్యుడి చికిత్స.. యువతి హఠాన్మరణం.. !!

Published : Apr 01, 2021, 02:09 PM IST
భూతవైద్యుడి చికిత్స.. యువతి హఠాన్మరణం.. !!

సారాంశం

భూతవైద్యం ఓ యువతి ప్రాణాలు తీసింది. తెలంగాణలోని దేవరకొండలో జరిగిన ఈ దారుణఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనారోగ్యానికి గురైన ఓ యువతి కొండమల్లేపల్లిలోని ఒక భూతవైద్యుడు వద్ద చికిత్స పొందుతూ, బుధవారం హఠాన్మరణం చెందింది. 

కొండమల్లేపల్లి తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పిట్టల నరసింహకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కూతురు హిమవర్షిని అనారోగ్యానికి గురైంది. కొల్‌ముంతలపహాడ్‌ స్టేజీ సమీపంలోని భూతవైద్యుడి వద్ద చికిత్స పొందుతోంది. ఈక్రమంలో బుధవారం హిమవర్షిణి అకస్మాత్తుగా మృతి చెందింది. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu