ఇకనైనా అకాడమీని విభజించండి... లేదంటే సీఎం దృష్టికి..: ఉద్యోగ సంఘాల హెచ్చరిక

By Arun Kumar PFirst Published Apr 1, 2021, 10:37 AM IST
Highlights

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా అకాడమీ విభజన జరక్కపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలుగు అకాాడమీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత అనేక ప్రభుత్వ సంస్ధలు రెండుగా విడిపోయాయి. అయితే ఇప్పటికీ కొన్నింటి విభజన మాత్రం విభజన మాత్రం జరగలేదు. అలాంటి వాటిల్లో తెలుగు అకాడమీ ఒకటి. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా అకాడమీ విభజన జరక్కపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు వెంటనే నిర్ణయం తీసుకోకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని ఉద్యోగులు హెచ్చరించారు. 

సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఇరుపక్షాల(తెలంగాణ,ఏపి) ఏకాభిప్రాయంతో అకాడమీ ఉద్యోగులను నెలలోపు విభజన చేయాలని కోరుతూ తెలుగు అకాడమీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుగు అకాడమీ సంచాలకులు, ఏపి తెలుగు అకాడమీ సంచాలకులను  వినతిపత్రం ఇచ్చారు.

ఈ సంధర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అకాడమీ విభజన జరక్కపోవడంతో అకాడమీ ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో, రిక్రూట్ మెంట్స్ జరగక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కాబట్టి ఇకనైనా ఇరు డైరెక్టర్లు కూర్చొని ఏకాభిప్రాయంతో తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించే విధంగా అకాడమీని విభజన చేయాలని కోరారు.  

ప్రధాన కార్యదర్శి సామ బాబురెడ్డి మాట్లాడుతూ... కోర్టు ఉత్తర్వులు వచ్చిన తరువాత కూడా అకాడమీ విభజన జాప్యం చేయడం తగదని...ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకెవెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు సదన్ తేజ్, జాయింట్ సెక్రటరీ శ్యాంసుందర్,  కోశాధికారి శ్రీనాథ్, మరియు సభ్యులు చంద్రకుమార్, పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. 

click me!