హైద్రాబాద్‌లోని రెండు రియల్ ఏస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు: రూ. 700 కోట్లు లెక్క చూపని ఆదాయం గుర్తింపు

By narsimha lodeFirst Published Apr 1, 2021, 12:35 PM IST
Highlights

హైద్రాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న రెండు కంపెనీల్లో బ్లాక్ మనీని ఐటీ శాఖ ఉన్నట్టుగా గుర్తించింది. ఈ రెండు కంపెనీల్లో రూ.700 కోట్లకు లెక్కలు చూపలేదని ఐటీ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారికంగా గురువారం నాడు ప్రకటించింది.
 

హైదరాబాద్: హైద్రాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్న రెండు కంపెనీల్లో బ్లాక్ మనీని ఐటీ శాఖ ఉన్నట్టుగా గుర్తించింది. ఈ రెండు కంపెనీల్లో రూ.700 కోట్లకు లెక్కలు చూపలేదని ఐటీ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారికంగా గురువారం నాడు ప్రకటించింది.

యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు శివారు ప్రాంతాల్లో  రియల్ ఏస్టేట్ వెంచర్లు భారీగా వెలిశాయి.  రెండు ప్రముఖ కంపెనీలు ఈ ప్రాంతంలో వెంచర్లు ఏర్పాటు చేసినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది.రూ. 700 కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు గుర్తించినట్టుగా ఐటీశాఖ తెలిపింది. 

బ్లాక్ మనీ లావాదేవీల కోసం ఈ కంపెనీలు ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేసుకొన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. ఈ కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. రెండు వారాల్లోనే రూ. 3200 కోట్లు లావాదేవీలు జరిగినట్టుగా  ఐటీ శాఖ గుర్తించింది. రెండు వారాల క్రితం ఓ ఫార్మా కంపెనీలో ఐటీ శాఖ గుర్తించింది. ఈ కంపెనీలో రూ.2 వేల కోట్లను గుర్తించినట్టుగా ఐటీ శాఖ గుర్తించింది.
 

click me!