హైదరాబాద్ లో యువకుడి గొంతు కోసి దారుణ హత్య..!

Published : Jan 16, 2023, 09:37 AM IST
హైదరాబాద్ లో యువకుడి గొంతు కోసి దారుణ హత్య..!

సారాంశం

హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లో దారుణం జరిగింది. ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. 

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పండుగవేళ విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ లో ఓ యువకుడిని అతి దారుణంగా హతమార్చారు దుండగులు. 25యేళ్ల కలీమ్ అనే యువకుడిని గొంతుకోసి చంపేశారు. కలీమ్ ఇటీవలే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో అతడి దారుణ హత్యకు ప్రేమ వివాహమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కాగా, ఈ ఘటనలో కలీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే కలీమ్ ను ఇంత దారుణంగా హత్య చేయడానికి వ్యక్తిగత తగాదాలు కారణమా? లేక ప్రేమ పెళ్లి చేసుకోవడమా.. మరేదైనా కారణం ఉందా?? అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికారు. తల, మొండెం, కాళ్లను వేరువేరుగా నరికి పడేశారు. అనకాపల్లిలోని ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు  స్థానికులకు కనిపించాయి. దీంతో వెంటనే వీరు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  హత్యకు గురైన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు. 

వికారాబాద్ లో విషాదం.. బకెట్లో పడి యేడాది చిన్నారి మృతి..

అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. సంక్రాంతి పండుగరోజు ఈ దారుణం వెలుగులోకి రావడంతో స్తానికంగా కలకలం రేగింది. పండగ సెలవులు కావడంతో స్థానిక యువకులు క్రికెట్ ఆడేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ దుర్వాసన వస్తుండడం.. వారి బంతి వెళ్లి పడినచోట డెడ్ బాడీ శరీరభాగాలు కనిపించడంతో వెంటనే.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతదేహం ఉన్న తీరును బట్టి ఆ హత్య నాలుగైదు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. శరీరంలోని మరికొన్ని భాగాలు ఇంకా దొరకాల్సి ఉంది. 

హత్యకు ఆర్థిక లావాదేవీలా, మరేదైనా కారణమా.. అని అనుమానిస్తున్నారు. స్థానికంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అతడిని అతి దారుణంగా హత్య చేయడం వెనుక ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం ఎవరిది అనే విషయం తొందర్లోనే వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా