వికారాబాద్ లో విషాదం.. బకెట్లో పడి యేడాది చిన్నారి మృతి..

Published : Jan 16, 2023, 08:07 AM IST
వికారాబాద్ లో విషాదం.. బకెట్లో పడి యేడాది చిన్నారి మృతి..

సారాంశం

పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నిండింది. యేడాది చిన్నారి ఆడుకుంటూ వెళ్లి.. బకెట్లో పడి మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది 

వికారాబాద్ : సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటున్న వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఓ యేడాది చిన్నారి అంబాడుకుంటూ వెళ్లి.. తెలియక బకెట్లో పడిపోయాడు. దీంతో ఆ చిన్నారి మృత్యువాత పడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి శిశుమందిరం సమీపంలో ఉండే దశరథ్, భాగ్యలక్ష్మి భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్నవారు విఖ్యాత్ కు సంవత్సరం వయసుంది. దశరథ్ హైదరాబాద్ లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 

శనివారం పండుగ సందర్భంగా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఉదయం 11గం.ల సమయంలో చిన్నారి ఆడుకుంటున్నాడు. అంబాడుతూ ఇంట్లో తిరుగుతూ.. తిరుగుతూ వెళ్లి.. బాత్ రూంలోకి వెళ్లాడు. బాత్రూంలోపలికి వెళ్లిన చిన్నారి అక్కడున్న బకెట్ తో ఆడుకోబోయాడు. అది చిన్నారి మీద పడిపోయింది. దానికింద చిన్నారి ఇరుక్కుపోయాడు. 

కొత్త బిచ్చగాళ్లొచ్చారు.. ప్రచారం మొదలెట్టారు : మాజీ మంత్రి జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు

దీంతో ఊపిరి ఆడక బకెట్ కిందే ప్రాణాలొదిలేశాడు. ఆ తరువాత అరగంటకు బాబు ఎక్కడికి వెళ్లాడోనని కుటుంబసభ్యులు వెతకగా.. బాత్రూంలో విగజీవిగా కనిపించాడు. అది చూసిన వారి దు:ఖానికి అంతులేకుండా పోయింది. దశరథ్ ఉద్యోగానికి వెళ్లడానికి వికారాబాద్ లో ట్రైన్ ఎక్కుతుండగా ఈ విషయం తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చిన అతను కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. విఖ్యాత్ కు గత నెల 24న యేడాది నిండింది. ఫస్ట్ బర్త్ డే ఘనంగా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నల్గొండ గద్దర్ పాట ఎలివేషన్స్ తో... Revanth Public Meeting at Nakrekal
Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?