జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో.. యువకుడు ఆత్మహత్యాయత్నం.. !

Published : Jul 07, 2021, 11:21 AM IST
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో.. యువకుడు ఆత్మహత్యాయత్నం.. !

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ ఉదయం జరిగిన సంఘటన కాసేపు కలకలం సృష్టించింది. నడిరోడ్డులో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఈ ఉదయం జరిగిన సంఘటన కాసేపు కలకలం సృష్టించింది. నడిరోడ్డులో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

ఇది గమనించిన వాహనదారులు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని రక్షించి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో మాత్రం తెలియరాలేదు. 

పోలీసుల విచారణలో ఆ యువకుడిది శ్రీకాకుళం జిల్లా అని తెలిసింది. అయితే ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు? ప్రేమ వ్యవహారమా? ఆర్థిక పరిస్థితా? అనేది తెలియరాలేదు. యువకుడి ఆత్మహత్య వెనక గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?