తలిదండ్రులు లేని బాలికపై.. అన్నయ్య వరసయ్యే వ్యక్తి లైంగికదాడి.. !!

Published : Jul 07, 2021, 10:44 AM IST
తలిదండ్రులు లేని బాలికపై.. అన్నయ్య వరసయ్యే వ్యక్తి లైంగికదాడి.. !!

సారాంశం

కామంతో కళ్లు మూసుకుపోయి, వావి వరసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. చెల్లి వరసయ్యే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. 

కామంతో కళ్లు మూసుకుపోయి, వావి వరసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. చెల్లి వరసయ్యే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. 

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. బాలసదనంలో ఉండే ఓ బాలికను ఇటీవల జమ్ములమ్మ పండుగ కోసం గార్డియన్ అభ్యర్థన, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు బయటకు పంపించారు. 

అలా ఇంటికి వచ్చిన అమ్మాయి.. సోమవారంనాడు ఇంటి ఆవరణలో ఉండగా వరుసకు అన్నయ్య అయ్యే వెంకటేష్ అనే యువకుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. ఆ తరువాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. గార్డియన్ ఇచ్చిన సమాచారంతో చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్టు రూరల్ ఎస్ఐ షఫీ తెలిపారు. బాలికకు తల్లీ తండ్రి ఇద్దరూ లేరు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?