ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రవీణ్ రావు తో పాటు ఆయ న సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వీరంతా ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ కేసులో భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఈ నెల 3న కోర్టులో హాజరుకావాల్సి ఉంది. అయితే విచారణ నుండి తప్పించుకొనేందుకుగాను భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు తప్పుడు కోవిడ్ సర్టిఫికెట్లను సమర్పించారని అభియోగం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. pic.twitter.com/3Nmyxu3g0I
— Asianetnews Telugu (@AsianetNewsTL)భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్ జారీ చేసిన ఆసుపత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తే అసలు విషయం తేలింది. ఈ కోవిడ్ సర్టిఫికెట్ తాము జారీ చేయలేదని ఆసుపత్రి తేల్చి చెప్పడంతో బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ జారీ చేసిన ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిపై కూడ పోలీసులు కేసు పెట్టారు.