హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం... కత్తితో యువతి గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Oct 28, 2021, 09:48 AM ISTUpdated : Oct 28, 2021, 09:57 AM IST
హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం... కత్తితో యువతి గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నం

సారాంశం

తన ప్రేమను అంగీకరించడం లేదని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి బలవంతంగా చొరబడి యువతి గొంతు, మణికట్టును కోసి చంపడానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు  రక్షణ మాత్రం దక్కడంలేదు, ఏదో చోటు మృగాడి చేతిలో మహిళలు బలవుతూనే వున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది అతి కిరాతకంగా యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

వివరాల్లోకి వెళితే... hyderabad శివారులోని వట్టినాగులపల్లిలో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమ్ సింగ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అయితే యువతి అతడి ప్రేమను అంగీకరించకపోయేసరికి కోపాన్ని పెంచుకుని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

యువతి ఇంట్లో ఒంటరిగా వుండగా బలవంతగా ఇంట్లోకి చొరబడ్డ ప్రేమ్ సింగ్ మరోసారి తన ప్రేమను అంగీకరించాలని బెదిరించాడు. అయినప్పటికి యువతి ఒప్పుకోకపోవడంతో తనవెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసాడు. విచకక్షణారహితంగా యువతి గొంతు, కాలు మణికట్టును కత్తితో కోయడమే కాదు ఆమె బయటకు వెళ్లకుండా బంధించాడు. 

read more  నాగచైతన్యను హత్య చేసింది ప్రియుడే.. తప్పించుకోవడానికే కత్తిపోట్ల నాటకం...

అయితే యువతి కేకలు విన్న ఇంటిచుట్టుపక్కలవారు వచ్చిచూసేసరికి తీవ్ర గాయాలతో కనిపించింది. ప్రేమోన్మాది ప్రేమ్ సింగ్ కూడా చేతిలో కత్తితో అక్కడే వున్నాడు. దీంతో ముుందు ఆ కిరాతకుడిని బంధించి చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని దగ్గర్లోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి ఉపయోగించిన కత్తిని ఘటనాస్థలంనుండి స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే గత నెలలో కూడా ఇలాంటి దుర్ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. నేరేడుచర్ల మండలకేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమపేరిట వెంటపడి వేధిస్తూ... ఆమె ఎంతకూ అంగీకరించకపోవడంతో బాలసైదులు అనే దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి కాలేజీలో వుండగానే విద్యార్థులందరి కళ్లముందే కత్తితో దాడిచేసాడు. ఆమెను పట్టుకుని గొంతుకోసి అక్కడినుండి పరారయ్యాడు. 

తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న యువతిని కాలేజి సిబ్బంది మిర్యాలగూడలోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం పోలీసులకు ఈ విషయం తెలిసి కేసు నమోదు చేసి ప్రేమోన్మాదిని అరెస్ట్ చేసారు. ఈ ఘటనను మరిచిపోకముుందే హైదరాబాద్ లో తాజాగా మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.


 

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu