బిజెపిలోకి వీవీఎస్ లక్ష్మణ్: అమిత్ షా గ్రీన్ సిగ్నల్?

By telugu teamFirst Published Oct 28, 2021, 8:28 AM IST
Highlights

మాజీ హైదరాబాదు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అమిత్ షా గ్రిన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

హైదరాబాద్: ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.  అంతర్జాతీయ క్రికెట్ లో తన సత్తా చాటిన వివీఎస్ లక్ష్మణ్ ను వచ్చే ఎన్నికల్లో తురుపు ముక్కగా వాడుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోదంి. బిజెపి జాతీయ నాయకులతో ఆ విషయంపై వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

VVS Laxman చేరికకు కేంద్ర హోం మంత్రి Amit Shah ఇప్పటికే పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. టీ20 ప్రపంచ కప్ పోటీలకు ఆయన ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఆయన దుబాయ్ లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ఓ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. 

Also Read: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించిన రాహుల్ ద్రావిడ్... ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్...

వివిఎస్ లక్ష్మణ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన IPL జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) అధిపతిగా లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. క్రికెట్ లో మణికట్టు మాయాజాలంతో పరుగుల వరద పారించిన ఘనత వీవీఎస్ లక్ష్మణ్ కు ఉంది.

లక్ష్మణ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా భారత క్రికెట్ కు సేవలందించారు. వంద టెస్టు మ్యాచులు ఆడిన క్రికెటర్లలో ఆయన ఒక్కరు. లక్ష్మణ్ కు 2011లో పద్మశ్రీ అవార్డు లభిచంింది. లక్ష్మణ్ ను ముద్దుకు వెరీ వెరీ స్పెషల్ గా పిలుచుకుంటారు. 

లక్ష్మణ్ తల్లిదండ్రులు సత్యభామ, శాంతారామ్ విజయవాడలో పేరెన్నిక గన్న వైద్యులు. భారత రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మునివడు వీవీఎస్ లక్ష్మణ్. ఆయన హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో చదివారు. మెడికల్ స్కూల్లో చేరిన లక్ష్మణ్ క్రికెట్ ను వృత్తిగా ఎంచుకున్నారు. 

Also Read: తనను తానే తక్కువ చేసుకుంటున్నాడు.. రోహిత్ పై వీవీఎస్ లక్ష్మణ్ సీరియస్

తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. బండి సంజయ్ ప్రస్తుతం బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఈ స్థితిలో ప్రజాదరణ ఉన్న ప్రముఖులను బిజెపిలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీవీఎస్ లక్ష్మణ్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బిజెపి రాష్ట్ర నాయకత్వం హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికపై దృష్టి పెడుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఈటల రాజేందర్ ను కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరారు.

click me!