అనుమానాస్పద రీతిలో యువతి మృతదేహం... హైదరాబాద్ శివారులో కలకలం

Published : Jan 16, 2022, 11:50 AM ISTUpdated : Jan 16, 2022, 12:18 PM IST
అనుమానాస్పద రీతిలో యువతి మృతదేహం... హైదరాబాద్ శివారులో కలకలం

సారాంశం

హైదరాబాద్ శివారులోని  రాజేంద్రనగర్ లో ఓ యువతి మృతదేహం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. అయితే యువతిది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసారా అన్నది తెలియాల్సి వుంది. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) నగరంలో ఓ యువతి మృతదేహం అనుమానాస్పద రీతిలో గుర్తించారు. నగర శివారుప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్  ప్లాట్ నుండి దుర్వాసన రావడంతో మిగతా ఫ్లాట్ వాసులు వెళ్లిచూడగా యువతి మృతదేహం కనిపించింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారమివ్వడంతో యువతి మృతి వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... రాజేంద్రనగర్ (rajendranagar) పరిధిలోని అత్తాపూర్ చింతల్ మెట్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఇటీవల యువతి పుట్టినరోజు జరిగింది. అయితే భర్త్ డే పార్టీ జరిగినప్పటి నుండి ప్లాట్ మూసివేసి వుంది. తాజాగా ఆ ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో అపార్ట్ మెంట్ వాసులను అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. 

స్థానిక పోలీసులు అపార్ట్ మెంట్ కు చేరుకుని ప్లాట్ తలుపులు తెరిచిచూడగా యువతి అనుమానాస్పద రీతిలో మృతిచెందివుంది. దీంతో పోలీసులు క్లూస్ టీం,డాగ్ స్వాడ్ ను రప్పించి ఫ్లాట్ లో ఆధారాలను సేకరించారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. యువతి ఎవరు? ఆమెది హత్యా లేక ఆత్మహత్యా? తెలుసుకునే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదిలావుంటే నల్గొండ జిల్లా (nalgonda district)లోని గొల్లపల్లి (gollapally) గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల మెట్టు మహంకాళి అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగం పడివుండటం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. జిల్లా ఎస్పీ రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను కనుగొన్నారు.

తుర్కయాంజల్‌లోని ఓ భవనంలో మొండెం లభించింది. తలను వేరు చేసి మొండాన్ని భవనంలో దాచారు దుండగులు. నిర్మాణంలో వున్న భవనంలో మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడిని సూర్యాపేటలోని శూన్యపహాడ్‌కు చెందిన నాయక్‌గా గుర్తించారు. 
 
హతుడిని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) గా తండ్రి శంకర్ నాయక్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలిపారు.

ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతనిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మూఢనమ్మకాలతో ఎవరైనా నరబలి ఇవ్వడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా