తెలంగాణ‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు.. అధికారికంగా ప్రకటించిన సీఎస్.. ఎప్పటివరకంటే..?

By Sumanth KanukulaFirst Published Jan 16, 2022, 9:29 AM IST
Highlights

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు పొడగించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడగించనుందనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. 

click me!