ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డు బ్రేక్ చేసింది. ఈ ఏడాది ఆర్టీసీ సమ్మె విషయంలో విపక్షాలపై సీఎం కేసీఆర్ పై చేయి సాధించాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత ఆర్టీసీలో యూనియన్ల మనుగడ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డు సృష్టించింది.ఈ సమ్మెతో ఆర్టీసీ యూనియన్లు ఏం సాధించాయి, ప్రభుత్వం పైచేయి సాధించిందా అనే చర్చలు కూడ లేకపోలేదు.ఆర్టీసీ యూనియన్ల భవితవ్వం ఎలా ఉండబోతోంది, భవిష్యత్తులో ఆర్టీసీలో యూనియన్ల మనుగడ ఎలా ఉండబోతోందనే చర్చ ప్రస్తుతం సర్వత్రా సాగుతోంది. ఈ ఏడాదిలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె ఓ రకంగా రికార్డే.
undefined
తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది.ఈ ఏడాద అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీవరకు సమ్మె చేశారు. సుమారు 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సకల జనుల సమ్మె తర్వాత అత్యధిక కాలం సమ్మె చేసిన రికార్డు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ కార్మికులు బద్దలుకొట్టారు.ఉమ్మడి ఆధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ, సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ ఎన్‌జీవోలు 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 55 రోజుల పాటు జరిగిన సమ్మె ఆర్టీసీ కార్మికులదే కావడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆనాడు జేఎసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మె నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె కీలకమైన ఉద్యమం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఈ సమ్మెలో ఆర్టీసీ, తెలంగాణ ఎన్‌జీవోలు, సింగరేణి కార్మికులు కీలకంగా ఉన్నారు.
Also read:మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో పడిన సెప్టెంబర్ వేతనాలు
2011 సెప్టెంబర్ 13వ తేదీ నుండి ఆనాడు సకల జనుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కూడ దసరా పర్వదినం వచ్చింది.
ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన సమ్మె విరమించారు.. ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె విరమించారు.
ఏపీ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో కూడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు ఇతర డిమాండ్లను ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రభుత్వం ముందు ఉంచారు.
ఆర్టీసీ జేఎసీ నేతలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఎస్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. అక్టోబర్ 5వ తేదీ నుండి ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మెకు దిగారు. ఆర్టీసీ జేఎసీ నేతలు సమ్మె చేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు.
రెండు దఫాలు సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లోకి చేరాలని ఆర్మీసీ కార్మికులకు సమయం ఇచ్చారు. కానీ, ఆర్టీసీ కార్మికులు మాత్రంసమ్మెను వీడలేదు. ఆ తర్వాత
హైకోర్టు ఆర్టీసీ సమ్మె వ్యవహరాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. రెండు వారాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సమయంలో ఆర్టీసీ జేఎసీ నేతలు తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ కోరారు. కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. చివరకు గత నెల 28వ తేదీన రాత్రి తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశం తర్వాత విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులను కోరారు సీఎం కేసీఆర్. దీంతో ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు.
మొత్తంగా ఈ సమ్మెతో ట్రేడ్ యూనియన్లు(కార్మిక సంఘాలు) తీరుపై పాలక పక్షం తీవ్రంగానే ఎదురుదాడికి దిగింది. సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకొంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా ప్రకటించిన సీఎం కార్మికులను తిరిగి విధుల్లో చేరాలని కోరారు.
ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని 97 ఆర్టీసీ బస్ డిపోల నుండి ఐదుగురు ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో సమ్మె చేసిన ఆర్టీసీ సంఘాలు సాధించిందేమిటనే చర్చ కూడ లేకపోలేదు. సమ్మె చేస్తున్న కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న పాలకపక్షం చివరకు పై చేయి సాధించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఏం చేయాలో చేయలేని పరిస్థితుల్లో ఆర్టీసీ జేఎసీ నాయకత్వం సమ్మెను విరమిస్తామనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. ఈ సమయంలో తాము ఓడిపోయినట్టు కాదు, ప్రభుత్వం గెలిచినట్టు కాదని కూడ ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
ఆర్టీసీ లోని కార్మిక సంఘాల నేతలకు ఉన్న మినహాయింపులను కూడ రద్దు చేశారు. ఆయా డిపోల నుండి వచ్చిన ఐదుగురు కార్మికులతో భవిష్యత్తులో మరోసారి సమావేశం కానున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అయితే రానున్న రోజుల్లో ఆర్టీసీలో యూనియన్లు సమ్మె పిలుపు ఇస్తే కార్మికులు స్పందిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే సమ్మె తర్వాత ఆర్టీసీ యూనియన్లు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు నెలకొన్నాయి.
ఆర్టీసీ సమ్మెకు వెన్నుదన్నుగా నిలిచిన విపక్షాలపై కూడ సీఎం కేసీఆర్ పై చేయి సాధించారు. సమ్మెను బూచిగా చూపిన ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయంపై పెద్దగా మాట్లాడే అవకాశం విపక్షాలకు లేకుండాపోయింది.