ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

By narsimha lodeFirst Published Sep 20, 2018, 11:57 AM IST
Highlights

తండ్రి దాడిలో గాయపడిన మాధవి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోధా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇంకా 48 గంటలు గడిస్తే కానీ, ఏమీ చెప్పలేమన్నారు.
 

హైదరాబాద్: తండ్రి దాడిలో గాయపడిన మాధవి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోధా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇంకా 48 గంటలు గడిస్తే కానీ, ఏమీ చెప్పలేమన్నారు.

గురువారం నాడు ఉదయం యశోధా ఆసుపత్రి వైద్యులు  మాధవి ఆరోగ్యపరిస్థితిపై హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు.వెంటిటేటర్‌పై మాధవికి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు ప్రకటించారు.

తీవ్ర గాయాలు కావడం వల్ల  మాధవి ఒంట్లో నుండి తీవ్ర రక్తస్రావం జరిగిందని వైద్యులు చెప్పారు. రక్తస్రావాన్ని అరికట్టి చికిత్స చేసినట్టు చెప్పారు. చేయి పూర్తిగా తెగిపోయిందన్నారు. చేతిలో రాడ్స్ వేసి సరిచేసినట్టు వైద్యులు ప్రకటించారు.

8 గంటల పాటు శ్రమించి రక్త శ్రవాన్ని తగ్గించినట్టు వైద్యులు ప్రకటించారు. మాధవికి ఆరు బాటిళ్ళ రక్తాన్ని ఎక్కించినట్టు చెప్పారు. మెడపై ఉన్న గాయాలను తగ్గించే ప్రయత్నం చేసాంసినట్టు చెప్పారు. అంతేకాదు  మెదడుకు వేళ్ళే నరాలు తిరిగి యథావిధిగా పనిచేసేలా చికిత్స చేసినట్టు డాక్టర్లు ప్రకటించారు. మెదడుకు వెన్నుముకకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 

 

సంబంధిత వార్తలు

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!