టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

By narsimha lodeFirst Published Sep 20, 2018, 11:39 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీలో కొందరు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని... ఈ పేర్లను త్వరలోనే బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీలో కొందరు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని... ఈ పేర్లను త్వరలోనే బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీపీసీసీకి రెండు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 9 అనుబంధకమిటీలను ఏర్పాటు చేసింది.ఈ కమిటీల కూర్పుపై  మాజీ ఎంపీ వి.హనుమంతరావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ కోవర్టులు  కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ కోవర్టుల పేర్లను త్వరలోనే బయటపెడతానని వీహెచ్ బాంబు పేల్చారు. తాను  కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటీ ఛైర్మెన్ పదవిని కోరుకొన్నట్టుగా వీహెచ్ చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా తనకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్ బాధ్యతలను కూడ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను  ప్రచార వాహానాన్ని కూడ సిద్దం చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, తనకు ప్రచార కమిటీలో బాధ్యతలు ఇవ్వకుండా ఇతర కమిటీలో బాధ్యతలు కల్పించడంపై వీహెచ్ సీరియస్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టుల కారణంగానే తనకు ఈ పదవి దక్కలేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీలో పదవి లేకపోతే చంచల్‌గూడ జైల్లోనే ఉండడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ పదవి లేకపోతే  తాను ఇంట్లోనే కూర్చొంటానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు లేవని వీహెచ్ ఆరోపించారు.

ఈ వార్తలు చదవండి

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!
Last Updated Sep 20, 2018, 11:39 AM IST
click me!