సూర్యాపేటలో యాదాద్రి తరహా జగదీశ్ రెడ్డి చిట్టడివి

By Sreeharsha GopaganiFirst Published Jul 18, 2020, 4:24 PM IST
Highlights

యాదాద్రి అడవులను మై మరిపించే రీతిలో సూర్యపేట లో వనానికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు. 

అంతరించి పోతున్న అడవులను పునరుద్ధరించాలన్న తలంపుతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల వారిగా చిట్టడవులను సృష్టిస్తుందని సూర్యపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు పేర్కొన్నారు.

యాదాద్రి అడవులను మై మరిపించే రీతిలో సూర్యపేట లో వనం ఏర్పాటు చెయ్యడం పట్టణ ప్రజల అదృష్టంగా ఆమె అభివర్ణించారు.పైగా ఆ వనానికి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు పెట్టడం ఆనందదాయకంగా ఉందని ఆమె చెప్పారు.

సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని జాతీయ రహదారి-65 ను ఆనుకొని ఉన్న ఎకరం 30 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిట్టడవిని ఆమె రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లాకలెక్టర్ వినయ్ కృష్ణారెడ్ది లతో కలసి ప్రారంభించారు.

20 కి పైగా పండ్లు, పులా మొక్కల రకాలతో మొత్తం 10 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్ కు జగదీషన్న పట్టణ ప్రగతి వనం  గా నామకరణం చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజున పర్యావరణ పరిరక్షణకు గీటు రాయిగా నిలిచే అడవిని ప్రారంభించుకోవడం తో పాటు అదే అడవికి మంత్రి పేరు పెట్టడం మహభాగ్యమని రాజ్యసభ సభ్యులు బడుగులింగయ్య యాదవ్ వర్ణించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే భవిష్యత్ తరాలకు ఆక్సిజనందించే హరితహారం వంటి విపలవాత్మక మైన కార్యక్రమాలకు పునాది పడిందన్నారు.మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లదాన్ని,ఆనందించే పార్క్ లు ఓపెన్ చెయ్యడం అది జాతీయరహదరినిఅనుకుని ఏర్పాటు చెయ్యడం చారిత్రాత్మక మైనదన్నారు.

ముమ్మాటికి ఈ పార్కు రెండు రాష్ట్రాల మధ్యన ఒక ఐకాన్ గా నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!