నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం సముదాయంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. కాంప్లెక్సు ఆవరణలోని డీఆర్వో కార్యాలయంలో కరోనాతో ఓ అటెండర్ మరణించాడు.
నిజామాబాద్: నిజామాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. నిజామాబాద్ జిల్లా కరోనా వైరస్ తో తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కరోనావైరస్ కలకలం చెలరేగింది. కలెక్టర్ కార్యాలయం కాంప్లెక్స్ లోని డీఆర్వో కార్యాలయంలో అటెండర్ గా పనిచేసే వ్యక్తి మరణించారు.
ఈ నెల 9వ తేదీ రాత్రి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లనే రోగులు మరణించారని వారి బంధువులు ఆరోపించారు. దాంతో ఈ నెల 10వ తేదీన ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
ఇదిలావుంటే, కరోనా మృతుడిని ఈ నెల 11వ తేదీన ఆటోలో తరలించిన సంఘటన తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై డిఎంఈ రమేష్ విచారణకు ఆదేశించారు. ప్రోటోకాల్ ను పాటించకుండా మృతదేహాన్ని తరలించడమే వివాదానికి కారణమైంది.
ఈ వరుస ఘటనల నేపథ్యంలోనిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ నాగేశ్వర రావు రాజీనామా కూడా చేశారు.