రేవంత్ గుర్తు ‘‘నక్షత్రం’’

Published : Sep 13, 2017, 01:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రేవంత్ గుర్తు ‘‘నక్షత్రం’’

సారాంశం

నక్షత్రం గుర్తుకు ప్రచారం చేస్తున్న రేవంత్ తెలంగాణకు పట్టిన శని వదలాలంటూ ప్రచారం టిఆర్ఎస్ పార్టీని సింగరేణి గనుల్లో బొందపెట్టాలని పిలుపు

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి నక్షత్రం గుర్తుకు ఓటేయాలంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అదేంటి టిడిపి గుర్తు సైకిల్ కాదని రేవంత్ నక్షత్రం గుర్తుకు ప్రచారం చేసుడేంది అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు ఒకసారి చదవండి.

సింగరేణి ఎన్నికల వేడి తీవ్రమైంది. అన్ని రాజకీయ పార్టీలు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకం అయ్యాయి.

టిడిపి బలపరిచే అభ్యర్థులకు నక్షత్రం గుర్తు వచ్చింది. దీంతో సింగరేణిలో రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ సింగరేణి కి చేసిన అన్యాయాలపై నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందన్నారు రేవంత్. తెలంగాణ వస్తే కార్మికులను గుండెలో పెట్టుకొని చూసుకుంటామని మాయమాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారని ఆరోపించారు. కానీ అమలు చేయడం లో పూర్తిగా విఫలమైయ్యారని విమర్శించారు.

వారసత్వ ఉద్యోగాలకు జివో ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి  దాపరించిన శని ని కడిగేయడానికే పార్టీలకు అతితగంగా నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని సింగరేణి కార్మికులకు రేవంత్ పిలుపునిచ్చారు. సింగరేణి ఎన్నికలో టీఆరెస్ ని ఓడించి బొగ్గుగనుల్ పాతి పెట్టాలని ఆయన ఓటర్లను కోరారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!