సికింద్రాబాద్‌లో భారీ చోరీ : రూ.5 కోట్ల సొత్తు అపహరణ, పనిమనుషుల పనేనా.. నేపాల్ బోర్డర్‌కి పోలీసులు

Siva Kodati |  
Published : Jul 11, 2023, 09:39 PM ISTUpdated : Jul 11, 2023, 09:49 PM IST
సికింద్రాబాద్‌లో భారీ చోరీ : రూ.5 కోట్ల సొత్తు అపహరణ, పనిమనుషుల పనేనా.. నేపాల్ బోర్డర్‌కి పోలీసులు

సారాంశం

సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీలో రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల సొత్తును అపహరించారు దొంగలు. రాహుల్ ఇంట్లో పనిచేసే నేపాలీలు ఈ చోరీ చేసినట్లుగా భావిస్తున్నారు. 

సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. రాహుల్ గోయల్ అనే వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల సొత్తును అపహరించారు. ఇందులో రూ.49 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వున్నాయి.  రాహుల్ కుటుంబం ఈ నెల 9న ఫాంహౌస్‌కు వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి వున్నాయి. అయితే దీనిని ఇంటి దొంగల పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు. రాహుల్ ఇంట్లో పనిచేసే నేపాలీలు ఈ చోరీ చేసినట్లుగా భావిస్తున్నారు. నిందితుల కోసం భారత్ - నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?