గుస్సాడి, దింస నృత్యాలతో... హైదరాబాద్ లో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు

By Arun Kumar PFirst Published Aug 9, 2021, 4:22 PM IST
Highlights

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడులకు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గుస్సాడి, దింస నృత్యాలతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరజ్, పద్మశ్రీ గుస్సాడి కనకరాజు హాజరయ్యారు. 

అలాగే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మి ప్రసాద్, గిరిజన మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జి. సీ. సి మేనేజింగ్ డైరెక్టర్ సీతారాం నాయక్,  చీఫ్ ఇంజనీర్ శంకర్ తో పాటు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

read more  ఆదివాసులకు కేసిఆర్ ఇప్పటికే చేసింది... ఇకపై చేయబోయేది ఇదే...: మంత్రి ఎర్రబెల్లి

ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వారిని సన్మానించారు. అలాగే 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ పథకం కింద 4.4 కోట్ల చెక్కులను మంత్రి సత్యవతి అందించారు. అటవీ నుంచి నాణ్యమైన తేనె ను ఉత్పత్తి చేసే వారికి 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు.

ఆదివాసీ మూలికా వైద్య విశిష్టత తెలిపే పుస్తకం, గోండు పద కోశం, పచ్చబొట్ల వైద్యం, ఆదివాసీల ఆహార, సంప్రదాయాలు తెలిపే పుస్తకాలను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అలాగే గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడంలో భాగంగా వేదిక మీద నేడు 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించారు.

click me!