కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల భేటీ: తెలంగాణ అధికారుల డుమ్మా, గెజిట్‌లో అంశాలపై ఏపీ అభ్యంతరాలు

By narsimha lodeFirst Published Aug 9, 2021, 3:37 PM IST
Highlights


కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల సమావేశం  సోమవారం నాడు జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. ఈ సమావేశాలను మరో రోజున ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మెన్లకు తెలంగాణ లేఖ రాసింది. గెజిట్‌లోని కొన్ని అంశాలపై అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం బోర్డు ఛైర్మెన్ల దృష్టికి తీసుకొచ్చింది.
 

హైదరాబాద్:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల సమావేశం సోమవారం నాడు హైద్రాబాద్‌ జలసౌధలో జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. కోర్టు కేసుల కారణంగా ఈ సమావేశాలకు హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ  ఛైర్మెన్లకు  తెలంగాణ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర  నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రిన్సిఫల్ సెక్రటరీ రజత్ కుమార్ ఆదివారం నాడు లేఖ రాశారు. 

also read:రాయలసీమపై నివేదికను సమర్పించలేం.. 3 వారాలు గడువు ఇవ్వండి: ఎన్జీటీకి కేఆర్ఎంబీ లేఖ

 మరో రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి  అవసరమై కార్యాచరణ అమలు చేసేందుకు గాను టైం షెడ్యూల్ కోసం ఇరు రాష్ట్రాలతో రెండు బోర్డుల ఛైర్మెన్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ఏపీ ఇరిగేషన్ శాఖాధికారులు హాజరయ్యారు.

గెజిట్ నోటిఫికేషన్ లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్న ఏపీ అధికారులు బోర్డు ఛైర్మెన్ల దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లొచ్చన్న బోర్డు ఛైర్మెన్లు ఏపీ అధికారులకు తెలిపారు. పూర్తి సమాచారం, వివరాలు ఇవ్వాలన్న బోర్డు చైర్మెన్లు ఏపీ అధికారులను కోరారు.నెల రోజుల్లో కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదన్న బోర్డు ఛైర్మెన్లు అభిప్రాయపడ్డారు.ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను  కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిస్తామన్న బోర్డు ఛైర్మెన్లు అధికారులకు హామీ ఇచ్చారు. గెజిట్‌లో షెడ్యూల్ 1,2,3లో మార్పులు చేయాలని కేంద్రానికి విజ్గప్తి చేస్తామని బోర్డు ఛైర్మెన్లు చెప్పారు.
 

click me!