స్నేహితుడితో ఓయో గదికి వచ్చి, మద్యం తాగి.. ఉదయానికి అనుమానాస్పదస్థితిలో యువతి మృతి..

By SumaBala Bukka  |  First Published Oct 12, 2023, 7:31 AM IST

హైదరాబాద్ మాదాపూర్ లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్నేహితుడితో కలిసి గదికి వచ్చింది. 


హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది.  మాదాపూర్ లోని హోటల్ గదిలో ఆ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించింది. అంతకు ముందు రోజు ఆమె తన స్నేహితుడితో కలిసి ఆ గదికి వచ్చింది. రాత్రి మద్యం తాగి ఇద్దరూ  నిద్రపోయారు. ఆ తరువాత యువకుడు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. అతను ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చేసరికి యువతి గదిలో మరణించి కనిపించింది.

దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మాదాపూర్ ఠాణా ఎస్సై వెంకట్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ శరవణప్రియ (25) అనే యువతి పుదుచ్చేరిలోని కామరాజనగర్ నివాసి. కొద్ది కాల క్రితం తెలంగాణలోని జడ్చర్లకు వలస వచ్చింది. ఫార్మా కంపెనీలో శరవణప్రియ ఉద్యోగం చేస్తోంది. శ్రీహరి రమేష్ (25) చెన్నై నివాసి.  ఆయన తన తండ్రి  వ్యాపార పనులు చూసుకుంటున్నాడు.

Latest Videos

undefined

తెలంగాణ ఎన్నికలు : అభ్యర్థుల రోజువారీ ఖర్చుపై ఈసీ నజర్.. చికెన్ బిర్యానీ రూ.140, టిఫిన్ రూ.35గా నిర్ణయం...

 శ్రీహరి రమేష్, శరవణప్రియ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ చెన్నైలో ఒకే కాలేజీలో ఇంటర్ వరకు చదువుకున్నారు. వ్యాపార పనుల్లో భాగంగా శ్రీహరి రెండు రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చాడు. తన స్నేహితురాలైన శరవణ ప్రియ హైదరాబాదులోనే ఉండడంతో ఆమెకు ఫోన్ చేశాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్డు నెంబర్ 36లో గోల్డెన్ హైవ్ ఓయో హోటల్ గదిలో తమ కోసం రూమ్ బుక్ చేశాడు. స్నేహితుడిని కలుసుకోవడం కోసం శరవణ ప్రియ మంగళవారం రాత్రి హోటల్ రూమ్ కు వచ్చింది. 

ఇద్దరూ హోటల్ రూమ్ లోనే మద్యం తాగారు. ఆ  తరువాత నిద్రపోయారు. అయితే, అర్ధరాత్రివేళ శ్రీహరికి వాంతులయ్యాయి.  దీంతో, బుధవారం తెల్లవారుజామున శ్రీహరి చికిత్స కోసం దగ్గరలోనే ఉన్న శ్రావణి ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత.. కాస్త కుదుట పడ్డాక మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డిశ్చార్జ్ అయి హోటల్ కి వచ్చాడు. తమ గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా, గదిలో ఉన్న శరవణప్రియ చలనం లేకుండా కనిపించింది. ఆమె పడుకున్న తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. మంచానికి ఒరిగి, నేలపై కూర్చుని మృతి చెంది కనిపించింది.  

వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు పోలీసులకు తెలిపారు. హోటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 10:49 నిమిషాల సమయంలో శరవణ ప్రియ రిసెప్షన్ కు ఫోన్ చేసింది. తమ రూమును ఇంకో రోజుకు పొడిగించాలని చెప్పుకొచ్చింది. ఆ తరువాత జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వచ్చిన తర్వాత.. ఎన్ని సార్లు బెల్లు కొట్టినా ఆమె తలుపు తీయలేదు. దీంతో.. ఆర్డర్ చేసిన ఫుడ్ పాకెట్ ను రిసెప్షన్లో ఇచ్చి డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు.  ఫుడ్ ఆర్డర్ చేసి, వచ్చేలోపు ఏం జరిగిందనేది అనుమానాస్పదంగా మారింది. అయితే పోలీసులు మాత్రం అనారోగ్యం కారణంగానే ఆమె మృతి చెంది ఉంటుందని  అనుమానిస్తున్నారు. 
 

 

click me!