తెలంగాణ ఎన్నికలు : అభ్యర్థుల రోజువారీ ఖర్చుపై ఈసీ నజర్.. చికెన్ బిర్యానీ రూ.140, టిఫిన్ రూ.35గా నిర్ణయం...

By SumaBala Bukka  |  First Published Oct 12, 2023, 6:52 AM IST

ప్రచార సమయంలో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు సంబంధించి ఈసీ ఓ ధరల పట్టికను రూపొందించింది. ఇక మీదట ఈ ప్రకారమే లెక్కలు చూపించాల్సి ఉంటుంది. 


హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేయనున్న అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం కచ్చితంగా లెక్కించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రచారంలో భాగంగా సభలు, సమావేశాలు నిర్వహించే సమయంలో వాటికి అయ్యే ఖర్చుల విషయంలో దృష్టి పెట్టనుంది. 

అభ్యర్థులు ఈ సమావేశాలు సభల నిర్వహణలో పాల్గొని కార్యకర్తలకు  కాఫీ, టీ, టిఫిన్, బిర్యానీల కోసం ఖర్చు పెట్టే డబ్బులను  తక్కువ మొత్తంలో చూపించేవారు. కానీ ఈసారి ఎన్నికల సంఘం దీనిమీద దృష్టి పెట్టింది. దీనికి ఆస్కారం లేకుండా స్వయంగా ఎన్నికల సంఘం  అధికారులే ధరల జాబితాను ఏ రూపొందించారు. 

Latest Videos

మీ ప్రభుత్వానికి వారి శాపం తగులుతుంది.. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఈ జాబితా ప్రకారం ధరలను లెక్కించనున్నారు. ఈ రేట్ల పట్టికలో వాటర్ ప్యాకెట్ల నుంచి మొదలుకొని అనేక రకాల వస్తువుల ధరలను నిర్ణయించారు. వీటిలో వాటర్ ప్యాకెట్లు, టీ, టిఫిన్, బిర్యానీలలాంటి  తినుబండారాలతో పాటు.. సమావేశాల నిర్వహణకు ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్ఈడి స్క్రీన్ ల ధరలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం రోజుకి ఒక్కో ఎల్ఈడి స్క్రీన్ కి రూ.15వేలు, ఒక్కో బెలూన్ కు రూ.4 వేలు కిరాయిగా లెక్కిస్తారు. 

ఈ సభలు సమావేశాలను ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించినట్లయితే దానికి ఓ లెక్క నిర్ణయించారు.. పట్టణాల్లో రోజుకు రూ. 15000  తప్పనిసరిగా అభ్యర్థి తన ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రచార సమయంలో అభ్యర్థి పెట్టిన ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘానికి చూపించాల్సిన వ్యయంలో… సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారులకు ఇచ్చే పారితోషకం, కుర్చీలు, టేబుల్లు, వాహనాల కిరాయిలకు సంబంధించిన వివరాలు కూడా  తప్పనిసరిగా ఉండాలని ఎన్నికల సంఘం.

ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బు ఏరులై పారుతుంది. సభలు, సమావేశాల నిర్వహణకు.. ఓట్ల కోసం పంచడం.. ఇలాంటి అనేక లెక్కలేని ఖర్చులు జరుగుతుంటాయి. అయినా కూడా ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితిలోపే ఎక్కువ మంది అభ్యర్థులు లెక్కలు చూపిస్తారు. దీంతో ఈసారి ఎన్నికల సంఘం దీనిమీద కాస్త గట్టిగా అనే దృష్టి పెట్టింది. ప్రచార సమయంలో నిర్వహించే సమావేశాలకు అయ్యే ఖర్చు పరిమితిని పెంచితే  అక్రమాలకు కాస్త అడ్డుకట్ట వేయవచ్చని భావించింది. 

దీంతోనే 2022లోనే కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయం పరిమితిని పెంచింది. దీని ప్రకారం చూస్తే..  2014లో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి చేయాల్సిన వ్యయపరిమితి గరిష్టంగా రూ.75 లక్షలు ఉంటే.. 2022 కు వచ్చేసరికి ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని కూడా రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఈ పెంచడం కూడా 8 ఏళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని పెంచింది. ఒకసారి ఈ జాబితాలో ఉన్న లెక్కలను పరిశీలిస్తే…

డీసీఎం వ్యాన్  పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ రూ.3వేలు…మినీ బస్సుకు  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3500, ఇన్నోవా కారుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4000, పెద్ద బస్సు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6000,  బెలూన్  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.4000,  డ్రోన్ కెమెరా  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000, ఫంక్షన్ హాల్  పట్టణ  ప్రాంతంలో రూ. 15000, గ్రామీణ ప్రాంతంలో రూ.12000, ఎల్ఇడి స్క్రీన్  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 15 వేలుగా నిర్ణయించారు.

ఇక ఆహార పదార్థాల విషయానికి వస్తే…
పెద్ద సమోసా ఒకటి..  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10, లీటరు నీళ్ల సీసా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20, పులిహోర  పట్టణ ప్రాంతంలో రూ.35, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30,  టిఫిన్  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ.80, వెజిటబుల్ బిర్యాని  పట్టణ ప్రాంతంలో రూ.80, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 70, చికెన్ బిర్యాని పట్టణ ప్రాంతంలో రూ.140, గ్రామీణ ప్రాంతాల్లో రూ.100 , మటన్ బిర్యానీ పట్టణ ప్రాంతంలో రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150గా నిర్ణయించారు.

click me!