రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కొత్త సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ ను సిద్దం చేసుకుని అడ్డంగా బుక్కయ్యింది.
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ ను సిద్దం చేసుకుంది ఓ మహిళా టెకీ. స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించి మత్తులో మునిగితేలేందుకు సిద్దమయ్యింది. మరికొద్ది గంటల్లో పార్టీ ప్రారంభం అవుతుందనగా కథ అడ్డం తిరిగింది. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు మహిళా సాప్ట్ వేర్ ను డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ శివారులో ఈ డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసముండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంధ్య(26) న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సిద్దం చేసుకుంది. దాదాపు రూ.2లక్షల విలువచేసే 7గ్రాములకు పైగా ఎండీఎంఏ డ్రగ్స్ ను ఆమె ఎలాగో సమకూర్చుకుంది. తన స్నేహితులు అర్జున్, డేవిడ్ లతో కలిసి డ్రగ్స్ తీసుకోడానికి సిద్దమైన సాఫ్ట్ వేర్ యువతి అడ్డంగా బుక్కయ్యింది.
అయితే న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే బాలానగర్ ఎస్వోటి పోలీసులకు శివరాంపల్లి అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంలో వెంటనే వారు సాప్ట్ వేర్ ఇంజనీర్ సంధ్య ప్లాట్ లో సోదాలు చేపట్టగా ఎండీఎంఏ పట్టుబడింది. దీంతో వెంటనే ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ డ్రగ్స్ ఎక్కడినుంది వచ్చిందనేది తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read మద్యం మత్తులో ఏడేళ్ల కూతురిని మంటల్లో వేసిన తండ్రి: కాపాడిన పక్కింటి వ్యక్తి
ఇదిలావుంటే హైదరాబాద్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. పంజాబ్ లో చదువుకునే తెలుగు విద్యార్థలు నవీన్, సాయితేజకు అక్కడ డ్రగ్స్ స్మగ్లర్లతో పరిచయం ఏర్పడింది. దీంతో వాళ్లు పంజాబ్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి గుట్టుగా అమ్ముకుంటున్నారు. ఇలా న్యూఇయర్ వేడుకల కోసం బ్రౌన్ షుగర్ తో పాటు కొకైన్, ఎండిఎంఏ హైదరాబాద్ కు చేర్చారు. ఈ డ్రగ్స్ అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.