
తెలంగాణ సిఎం కెసిఆర్ కు కరీంనగర్ ఆడబిడ్డ షాక్ ఇచ్చారు. కరీంనగర్ లో జరిగిన హరిత హారం సభలో కెసిఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒక మహిళ లేచి నినాదాలు చేశారు. తమకు సన్న బియ్యం ఇయ్యాలంటూ పెద్ద స్వరంతో నినాదాలు చేశారు. దీంతో సభలో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు.దొడ్డు బియ్యం బదులు తమ బిడ్డలకు సన్నబియ్యం ఇయ్యాలని ఆ మహిళ నినాదాలు చేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.మహిళా పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి తరలించారు. సిఎం సభలో ఒక మహిళ నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.