బంగారంతో తలగోక్కుంటున్న మోడి

Published : Nov 30, 2016, 04:53 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
బంగారంతో తలగోక్కుంటున్న మోడి

సారాంశం

తల్లి, అమ్మమ్మలు, నానమ్మల దగ్గర నుండి వంశపరంపర్యంగా వచ్చిన బంగారానికి ఇపుడు లెక్కలు చూపాలంటే ఎవరికీ సాధ్యం కాదు.

మోడి ప్రభుత్వం అనవసరంగా బంగారంతో తలగోక్కుంటోంది. బంగారం లాంటి తేనెతుట్టెలో ప్రధానమంత్రి మోడి వేలు పెడుతున్నారు.  ఇళ్ళల్లో ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాలని కేంద్రం గనుక నిర్భందిస్తే మోడి సర్కార్ కు చుక్కలు కనబడటం ఖాయంగా తెలుస్తోంది. పార్లమెంట్ ఆమోదించిన కొత్త ఐటి చట్టంపై మహిళా లోకం మండిపడుతోంది.

 

ఎందుకంటే, దేశంలోని బంగారంలో సుమారు పావు వంతు మహిళల వద్దే ఉంటుంది. దేశంలోని మహిళలకు, బంగారానికి శతాబ్దాల తరబడి అవినావభావ సంబంధముందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో తల్లులు, అత్తల వద్ద నుండి వచ్చిన బంగారమే ఎక్కువుంటుంది.

 

బంగారం కొనుగోలు చేసే మహిళల్లో భర్తలకు తెలియకుండా కొనే వారుంటారు. చేతిలో సరిపడా డబ్బుంటే చాలు ఎక్కువ మంది మహళిలు బంగారం కొనుగోలుకే మొగ్గు చూపుతుంటారు. వారి ఆలోచనలో ఎంతో ముందుచూపు దాగివుంటుంది. ఇపుడు బంగారంపై పెట్టే పెట్టుబడి భవష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని, కుదవపెట్టో లేక అమ్మేసో సొమ్ము చేసుకోవచ్చని మహిళల ఆలోచన.

 

కాబట్టి దేశంలోని కోట్లాది మంది మహిళల వద్ద ఏదో రూపంలో బంగారం ఉంటుంది. మరి, అటువంటి బంగారానికి ఇపుడు కేంద్రం లెక్కలు చెప్పాలని నిర్భందిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి నుండి కొనుగోలు చేసే బంగారానికి లెక్కలు చెప్పాల్సిందే అని అడగటంలో తప్పు లేదు. కానీ మోడి సర్కార్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం దగ్గరున్న మొత్తం బంగారానికి లెక్కలు చెప్పాల్సిందేనంటోంది.

 

సమస్యల్లా ఇక్కడే వస్తోంది. కొత్త చట్టం ప్రకారం లెక్కలు లేదా బిల్లులు చూపని బంగారం మొత్తం నల్లడబ్బుతో కొన్న బంగారంగానే చూస్తోంది. ఒకవేళ లెక్కలు చూపకపోతే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలు చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని కొత్త చట్టంలో కేంద్రం పేర్కొనటం గమనార్హం. అటువంటి బంగారంపై దాని విలువలో 80 శాతం పన్ను కట్టాల్సిందేనని చట్టంలో పేర్కొన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని మహిళల వద్ద సుమారు 10 వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా.

 

 

మోడి సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టంపై మహిళా లోకం మండిపడుతోంది. తల్లి, అమ్మమ్మలు, నానమ్మల దగ్గర నుండి వంశపరంపర్యంగా వచ్చిన బంగారానికి ఇపుడు లెక్కలు చూపాలంటే ఎవరికీ సాధ్యం కాదు. తరాల నుండి వస్తున్న బంగారానికి ఇపుడు లెక్కలు, బిల్లులు చూపమంటే ఎలా సాధ్యమని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నల్లధనం వెలికి తీస్తా కొద్ది రోజులు ఇబ్బంది పడమంటే సరే అనుకున్నాం గానీ తమ ఇళ్ళల్లోని బంగారం జోలికి వస్తే సహేంచేది లేదంటున్నారు.

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు