నయీం గ్యాంగ్‌కు జైలులో రాజమర్యాదలు

Published : Nov 29, 2016, 03:16 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నయీం గ్యాంగ్‌కు జైలులో రాజమర్యాదలు

సారాంశం

అదనపు సౌకర్యాలు కల్పించిన జైలర్ గోపిరెడ్డి వరంగల్ కేంద్ర కారాగారం నుంచి బదిలీ వేటు

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులకు జైలులో సకల సౌకర్యాలు కల్పించిన  ఓ జైలర్ పై అధికారులు ఆలస్యంగానైనా చర్య తీసుకున్నారు.

 

వరంగల్‌ కేంద్ర కారాగారంలో జైలర్ గా  పనిచేస్తోన్న గోపి రెడ్డి  అక్కడ జైలులో ఖైదీలుగా ఉన్న నయీం గ్యాంగ్‌కు చెందిన పాశం శ్రీను, సుధాకర్‌లకు సకల సదుపాయాలు కల్పించారు. ఈ క్రమంలో జైలర్‌ గోపి రెడ్డి ఖైదీల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

 

ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. చివరికి ఆ ఆరోపణలన్నీ నిజమేనని రుజువు కావడంతో జైలర్‌ గోపి రెడ్డిపై బదిలీ వేటు పడింది. అంతేకాదు, జైలర్ వ్యవహారంపై విచారణ జరపాలని నయీం కేసును విచారిస్తున్న సిట్‌కు లేఖ రాసినట్లు జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు