బాబును నమ్ముకుంటే మోదీ గతి అంతే

Published : Nov 29, 2016, 03:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
బాబును నమ్ముకుంటే మోదీ గతి అంతే

సారాంశం

బ్యాంకర్లను తప్పుపట్టడం బాబుకు సరికాదు నోట్ల రద్దు వల్ల దేశం అల్లకల్లోలం అవుతోంది బిజెపి, టిఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల ఫైర్

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలోని ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నుకుండిపోయాయని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. బ్యాంకర్లపై నెపం మోపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని .. ఇది సరికాదని విమర్శించారు.

 

మంగళవారం గాంధీ భవన్ లో పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ నేతలు వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, కోదండరెడ్డి తదితరులు మాట్లాడారు.


పెద్ద నోట్ల రద్దు పై చంద్రబాబు మోదీకి తప్పుడు సలహా ఇచ్చారని,  అభిమాన్యుడిని పద్మవ్యూహంలోకి పంపినట్లుగా బాబు .. మోదీని ఈ నోట్ల రద్దులో ఇరికించాడని పేర్కొన్నారు.

 

గతంలో అలిపిరి ఘటన తరువాత కూడా వాజపేయి ని తప్పుదారి పట్టించి ఎన్నికలకు వెళ్లేలా సలహా ఇచింది చంద్రబాబే అని  ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయిందని గుర్తు చేశారు. ఇప్పుడు మోదీకి అదే గతి పట్టడం ఖాయమన్నారు. నోట్ల రద్దుతో వచ్చే ఇబ్బందులను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు