అందుకే చంపా: భర్త హత్యపై దేవిక, ఆ గడ్డం వ్యక్తి ఎవరు?

First Published Aug 8, 2018, 12:01 PM IST
Highlights

వివాహేతర సంబంధం పెట్టుకొందని వేధిస్తున్న భర్తను తాను  హత్య చేసినట్టు  భార్య దేవిక పోలీసులకు తెలిపింది.హైద్రాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దేవిక తన భర్త జగన్‌ను హత్య చేసింది. 


చెన్నై: వివాహేతర సంబంధం పెట్టుకొందని వేధిస్తున్న భర్తను తాను  హత్య చేసినట్టు  భార్య దేవిక పోలీసులకు తెలిపింది.హైద్రాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దేవిక తన భర్త జగన్‌ను హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమాని కూడ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో దేవిక  కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నారు.

నల్గొండ జిల్లా  గరిడేపల్లి మండలం గారకుంట తండాకు చెందిన  బానోతు  జగన్, దేవిక హైద్రాబాద్ ఫిల్మ్‌నగర్‌ లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బర్త్ పిల్లల ఆసుపత్రిలో జగన్  రన్నర్ బాయ్ గా పనిచేస్తున్నాడు.  కొంతకాలంగా దేవికపై జగన్ అనుమానాన్ని పెంచుకొన్నారు. 

తాను ఇంట్లో లేని సమయంలో  ఓ వ్యక్తి  వచ్చి పోతున్నాడని దేవికను జగన్ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయమై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకొంటున్నాయి. 

అయితే సోమవారం రాత్రి కూడ  భార్య, భర్తల మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. ఈ గొడవ జరగడానికి ముందుగా జగన్  తన బావమరిది రమేష్ కు ఫోన్ చేసి బీరు కావాలని కోరాడు.  కొద్దిసేపటికే రమేష్ బీరు తెచ్చి ఇచ్చాడు.  బీరులో నల్లుల మందును కలిపిన జగన్ ఇద్దరం తాగుదామని  భార్యకు ఇచ్చాడు. తాను చావనని... నీవు చావాలని భర్తపై దేవిక ఎదురుతిరిగింది. 

దీంతో ఇద్దరి మధ్య  గొడవ జరిగింది. బీరు సీసాతో  తనను పొడిచేందుకు వస్తున్న జగన్‌ ప్రైవేట్ పార్ట్స్‌పై  దేవిక గట్టిగా తన్నింది. దీంతో జగన్  అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో  పిల్లలిద్దరూ కూడ భయపడిపోయారు. వారిని బాత్‌రూమ్ లో వేసి  తలుపులు వేసింది దేవిక. ఆ తర్వాత భర్తపై కూర్చొని గొంతు నులిమి చంపేసినట్టు ఒప్పుకొంది.

 

మరో వ్యక్తి సహాయంతోనే దేవిక ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి  తన తండ్రి నిద్రపోతున్న సమయంలో గడ్డం ఉన్న ఓ వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని జగన్ కొడుకు పోలీసులకు చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తన తల్లి తనకు చెప్పిందని ఆ అబ్బాయి చెప్పాడు. 

తమ ఇంటి గేటును ఓ వ్యక్తి దూకినట్టు అలికిడి అయినట్టు ఇంటి యజమాని  చెప్పారు.  ఈ విషయమై దొంగలు వచ్చారని భావించి కర్రలు కారం పొడి తీసుకొని  తాను జగన్ ఉంటున్న గది వద్దకు వెళ్లినట్టు  ఇంటి యజమాని చెప్పారు. 

మరో వ్యక్తి సహాయంతోనే దేవిక ఈ హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జగన్ తనయుడు, ఇంటి యజమాని ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  మరో వ్యక్తి ప్రమేయం ఈ కేసులో ఉందని భావిస్తున్నారు.మూడు బృందాలు మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మరో వైపు దేవిక కాల్‌డేటా ఆధారంగా కూడ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 

ఈ వార్తను చదవండి: ఫిల్మ్‌నగర్‌లో భర్తను చంపిన దేవిక: పారిపోయిందేవరు?
 

click me!