ప్రేమోద్మానికి మరో యువతి బలి... బ్లేడ్‌తో యువతి గొంతు కోసి హత్య

Published : Aug 08, 2018, 11:06 AM ISTUpdated : Aug 08, 2018, 11:13 AM IST
ప్రేమోద్మానికి మరో యువతి బలి... బ్లేడ్‌తో యువతి గొంతు కోసి హత్య

సారాంశం

ప్రేమ...రెండు జీవితాలను ఒకటి చేసి నిండు నూరేళ్లు కలిసి ఉండేలా చేస్తుంది. కానీ ఇదే ప్రేమ పేరుతో ఉన్మాదిగా మరిన ఓ యువకుడు ఓ అమాయకురాలి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పరిదిలో చోటుచేసుకుంది.  

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రైల్వే క్వాటర్స్ లో అనూష(16) అనే యువతి కుటుంబంతో కలిసి నివాసముంటోంది. ఈమె నారాయణగూడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే నారాయనగూడలోనే న్యూ చైతన్య జూనియర్ కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకట్ అనే యువకుడు ప్రేమ పేరుతో అనూషను నిత్యం వేధించేవాడు. ఇతడి ప్రేమను అనూష నిరాకరించింది.

దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న వెంకట్ మంగళవారం సాయంత్రం అనూష నివాసముండే రైల్వే క్వాటర్స్ కి వెళ్లాడు. మాట్లాడాల్సి ఉందని అనూషను పిలిచి తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో గొంతు కోశాడు. దీంతో అనూష రక్తపుముడుగులో పడిపోయింది. ఈ ఉన్మాదంలోనే వెంకట్ తాను అనూషను చంపేశాను అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అతడి మాటలు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా నిజంగా అనూష కిందపడిచోయి ఉంది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. 

కొన ఊపిరితో పడివున్న అనూషను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వెంకట్ ను అరెస్ట్ చేశారు.   
 
PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu