సహజీవనానికి అడ్డురాని కులం పెళ్లికి అడ్డొచ్చిందా?: ప్రియుడి ఇంటిముందు యువతి ఆందోళన

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 1:47 PM IST
Highlights

ఐదేళ్లు సహజీవనం చేసి పెళ్లి పేరు ఎత్తగానే ప్రియుడు ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి న్యాయపోరాటం ఆరంభించింది. 

వరంగల్: ప్రేమ పేరుతో యువతిని నమ్మించిన యువకుడు ఐదేళ్లపాటు సహజీవనం చేశాడు. ఆమెతో ఇన్నాళ్లు శారీరక వాంఛ తీర్చుకోడానికి అడ్డురాని కులం పెళ్లి చేసుకోడానికి మాత్రం అడ్డొచ్చింది. పెళ్లి పేరు ఎత్తగానే ప్రియుడు ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి న్యాయపోరాటం ఆరంభించింది.  ప్రియుడి ఇంటి ముందే దీక్షకు దిగింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి కిరణ్ ప్రైవేట్ ఉద్యోగి. వరంగల్ కీర్తినగర్ కు చెందిన పవిత్రతో అతడి కొన్నేళ్లక్రితం పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. ప్రియుడు కిరణ్ పై నమ్మకంతో పవిత్ర ఐదేళ్లగా సహజీవనం చేస్తోంది. అతడు ఉద్యోగం చేసిన వరంగల్, హన్మకొండ, ములుగు, మిర్యాలగూడ ప్రాంతాల్లో వీరిద్దరు కలిసే వున్నారు. 

read more  చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న: అమ్మాయికి ఐదు నెలల గర్భం

ఇటీవల యువతి పెళ్లి చేసుకుందామని కిరణ్ ను కోరింది. అప్పటినుండి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇద్దరి కులాలు వేరు కాబట్టి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించరని చెబుతూ ఆమెను దూరం పెట్టసాగాడు. అంతేకాకుండా యువతిది చిన్న కులం కాబట్టి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నా గ్రామంలో పరువు పోతుందంటూ అవమానకరంగా మాట్లాడాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న పవిత్ర ఉప్పరపల్లిలోని కిరణ్‌ ఇంటి ఎదుట పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది. 

ప్రియుడి చేతిలో మోసపోయి పవిత్ర చేపట్టిన దీక్షకు ఎమ్మార్సీఎస్, ఎంఎస్‌ఎఫ్‌ సంఘాలు మద్దతు ప్రకటించాయి. పెళ్లి పేరుతో మోసం చేసిన కిరణ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, అన్నా, వదినపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 

click me!