హుజూరాబాద్‌లో గెలుపు మాదే: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్

Published : Jul 04, 2021, 01:08 PM IST
హుజూరాబాద్‌లో గెలుపు మాదే: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్

సారాంశం

టీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కొని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు.

ఆదివారం నాడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన  వ్యూహంపై   బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోరారు.

హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించి గెలిచేందుకు టీఆర్ఎస్ విశ్వప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. 
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఎన్నిక జిమ్మిక్కులు చేసినా ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీనేతలు డికె అరుణ, రాజాసింగ్, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu