కల్లులో మత్తుమందు కలిపి, మెడకు తీగ బిగించి.. భర్తను చంపిన భార్య,ప్రియుడికి జీవితఖైదు..

By SumaBala BukkaFirst Published Jan 25, 2022, 1:01 PM IST
Highlights

2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్ర పోయిన తర్వాత  ప్రియుడు  గుంటి బాలరాజుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని తమ అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా వీరి శబ్దం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో  మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయటప పడకుండా కరోనా సమయంలో కల్లు దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది.

మేడ్చల్ :  వివాహేతర సంబంధం పెట్టుకున్న woman, ప్రియుడి మోజులో పడి లోని ఇంట్లోనే extra marital affair కొనసాగించి భర్తకు పట్టుబడింది. తమ గుట్టు రట్టయ్యిందని భావించి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న husbandను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి medchal కోర్టు life imprisonment విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది.

మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోపలు మార్లు వాళ్ళ ఇంటికి వెళ్లడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు.  భర్త  అడ్డు తొలగించుకోవాలని మహాంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్ తో కలిసి పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు.

తీగను మెడకు చుట్టి..   
2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్ర పోయిన తర్వాత  ప్రియుడు  గుంటి బాలరాజుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని తమ అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా వీరి శబ్దం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో  మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయటప పడకుండా కరోనా సమయంలో కల్లు దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది.

మృతుడి సోదరుడికి అనుమానం రావడంతో...
మృతుడి సోదరుడు మహంకాళి సురేష్ మృతుడి దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి, గుంటి బాలరాజును రిమాండ్ కు తరలించారు. కాగా మేడ్చల్ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణకు రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరికి జీవితకాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

ఇలాంటి ఘటనే తాజాగా కర్ణాటక లోని జరిగింది. వివాహేతర సంబంధం హత్యకు దారితీసిన ఘటన karnataka లోని..హబ్లీ జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఓ Garment Factoryలో పని చేస్తుంది. పక్క గ్రామానికి చెందిన ఆటో నిర్వాహకుడు మంజునాథ్ మరప్పనవర్ ఆటోలోనే ఆమె రోజూప్రయాణించేది. ఈ క్రమంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి extra marital affairకి దారితీసింది.

ఈ విషయం మహిళ అన్న బసవరాజ కురడికేరికి తెలిసింది. అనైతిక సంబంధాలు తగదని మంజునాథ్ కు పలు మార్లు హెచ్చరికలు జారీ చేశాడు. కానీ మంజునాథ్ వినలేదు. చెల్లెలికి చెప్పినా ఆమే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చెల్లెలి కాపురం నిలబెట్టాలంటే మంజునాథ్ ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 

దీనికోసం తన చెల్లెలితోనూ మంజునాథ్ కు phone చేయించి.. పిలిపించాడు. వచ్చిన మంజునాథ్ ను ఈనెల 18న రాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. 
 

click me!