విషసర్పానికి లిప్ టు లిప్ ముద్దులు.. సెల్ఫీలు, ఫొటోలు.. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ...

By SumaBala BukkaFirst Published Jan 25, 2022, 10:37 AM IST
Highlights

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ (30) నగరానికి వలస వచ్చి wife, ఇద్దరు పిల్లలతో కలిసి గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ Cell phone ఫొటోలకు ఫోజులిచ్చాడు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. snake biteకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతను చేసిన తప్పల్లా.. snakeను పట్టుకున్నాక.. దాన్ని దూరంగా వదిలేయడమో.. స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీ వాళ్లకు ఇవ్వడమో చేయకుండా.. హీరోలా ఫొటోలకు ఫోజులివ్వడమే.. అది కూడా పాముకు Lip to lip kiss ఇస్తూ ఫోజులిచ్చాడు. వివరాల్లోకి వెడితే.. 

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ (30) నగరానికి వలస వచ్చి wife, ఇద్దరు పిల్లలతో కలిసి గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ Cell phone ఫొటోలకు ఫోజులిచ్చాడు. 

ఆ తరువాత సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఇక, గత నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ లోని Rajamahendravaramలో జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి నవంబర్ 27 రాత్రి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి, దాన్ని పట్టుకుని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 stitches వేసి ఇంజక్షన్లు ఇచ్చారు.

ఆపరేషన్ తరువాత పాము ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలో అటవీ ప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు. మరోవైపు, పాము కాటుతో చనిపోయేవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. అదే నెల మొదట్లో తెలంగాణలోని mahabubabad జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. 

మహబూబాబాద్‌ మండలం శనిగరపురంలో ఒకే ఇంట్లో ముగ్గురు snake biteకు గురయ్యారు. తల్లిదండ్రులతో పాటు చిన్నారిని పాము కాటేసింది. నవంబర్ 7న జరిగిన ఈ ఘటనలో 3 నెలల చిన్నారి మృతిచెందింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనిగపురానికి చెందిన మమత, క్రాంతి దంపతులకు 3 నెలల పాప ఉంది. ఆదివారం ఉదయం నిద్రలేచేసరికి పాప నోటి వెంట నురగ రావడం చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్టుగా వైద్యులు నిర్దారించారు.

మరోవైపు పాపకు కప్పి ఉంచి దుప్పటి నుంచి పాము బయటపడింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే మమత, క్రాంతి కూడా స్పృహ కోల్పోయారు. దీంతో వారిని కూడా పాము కాటేసిందని నిర్దారణకు వచ్చిన వైద్యులు.. అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూడు నెలల చిన్నారి పాము కాటుతో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు ఈ విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

click me!