ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌తో వర్కర్ శారీరక సంబంధం.. గర్భం దాల్చిన తర్వాత హత్య.. హైదరాబాద్‌లో ఘటన

By Mahesh K  |  First Published Apr 10, 2023, 3:55 AM IST

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఒడిశాకు చెందిన మహిళకు అక్కడే పనిచేస్తున్న మేనేజర్‌తో పరిచయం ఏర్పడింది. మేనేజర్ వివాహితుడైనా ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని కొనసాగించాడు. ఆమె గర్భం దాల్చిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని మేనేజర్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.


హైదరాబాద్: మేడ్చల్‌లో ఆదివారం ఓ దుర్ఘటన జరిగింది. ప్రైవేట్ కంపెనీలో పని చేసే ఓ మహిళ హత్యకు గురైంది. ఒడిశాకు చెందిన ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో వర్కర్. ఆ కంపెనీ మేనేజర్‌తో ఆమెకు శారీరక సంబంధం ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని మేనేజర్‌పై ఆమె ఒత్తిడి తెచ్చింది. ఆ మేనేజర్ ఆమెను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒడిశాకు చెందిన 22 ఏళ్ల ధరిత్రి సింగ్ మేడ్చల్‌కు వచ్చింది. కొంత కాలంగా ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసింది. అక్కడే ఆమెకు మేనేజర్ చాన్‌తో పరిచయమైంది. చాన్ వివాహితుడైనప్పటికీ ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. కొంత కాలం తర్వాత ఆమె గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని చాన్ పై ఒత్తిడి పెంచింది.

Latest Videos

పెళ్లిని తప్పించుకోవడానికి చాన్ ఆదివారం ఆ మహిళ ఇంటికి వెళ్లి గొంతు నులిమి చంపేసి ఉంటాడని మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Also Read: నల్గొండ : వేట కొడవళ్లతో యువకుడిని నరికి చంపిన దుండగులు.. పరువు హత్యగా అనుమానం

ఈ విషయం తెలియగానే మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ స్పాట్‌కు వెళ్లి ఫింగర్‌ఫ్రింట్స్, ఇతర సాక్ష్యాధారాలను సేకరించింది. 

ఓ ట్రాకర్ డాగ్‌ను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ కుక్క సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు పోలీసులను తీసుకెళ్లింది. అనంతరం, ఆ హంతకుడి వాసనను కుక్క పసిగట్టలేకపోయింది. హంతకుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం ఏర్పడింది.

click me!