అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని... ప్రియుడితో కలిసి భర్తను చంపిన కసాయి భార్య

By Arun Kumar PFirst Published Jun 14, 2021, 10:55 AM IST
Highlights

 అక్రమసబంధం గురించి భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి అతడి అడ్డు తొలగించుకుంది ఓ వివాహిత. 

నల్గొండ: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. గుట్టుగా సాగిస్తున్న అక్రమసబంధం గురించి భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి అతడి అడ్డు తొలగించింది వివాహిత. అనారోగ్యంతో భర్త చనిపోయాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు చేసింది. అయితే కాస్త ఆలస్యంగా అయినా అసలునిజం భయటపడింది.  

వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన ముళ్లగిరి ముత్యాలు-నాగమణి భార్యాభర్తలు. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నాగమణి మరోవ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. గ్రామానికి చెందిన మేరిగ నవీన్ తో భార్య అక్రమ బంధం గురించి తెలియడంతో ముత్యాలు సీరియస్ అయ్యాడు. భార్యతో పాటు ఆమె ప్రియుడు నవీన్ ను గట్టిగా హెచ్చరించాడు. దీంతో ముత్యాలు అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు. 

జూన్ 7వ తేదీన కూలీ పనికి వెళ్ళిన ముత్యాలు సాయంత్రం మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో గాఢ నిద్రలోకి వెళ్లగా ఇదే అదునుగా భావించిన నాగమణి ప్రియుడు నవీన్ కు సమాచారం అందించింది. వీరిద్దరు కలిసి నిద్రలో వున్న ముత్యాలు గొంతుకు చున్నీ బిగించి అతి కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కొత్త నాటకానికి తెరతీసింది. 

read more  పెళ్లయిన 20రోజులకే... నవ వధువు బలవన్మరణం... కారణమదేనా?

తన భర్త గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించింది నాగమణి. దీంతో అందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వదిన ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి సోదరుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌, సీఐ సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో నాగమణి, నవీన్ పరారయ్యారు. పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.  

  ఏమీ తెలియనట్లుగా ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరిని నమ్మించి అంతక్రియలు జరిపించింది. కాగా ముత్యాలు మృతిపై కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా హత్య చేసినట్లు ఒప్పుకొని పారిపోయింది. అనుమానంతో మృతుడి సోదరుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహానికి ఆదివారం తహసీల్దార్‌ దామోదర్‌రావు, సీఐ శివరామిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాగా మృతుడి భార్య ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

click me!