మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం... గర్భం దాల్చిన చిన్నారి

Arun Kumar P   | Asianet News
Published : Jun 14, 2021, 09:45 AM IST
మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం... గర్భం దాల్చిన చిన్నారి

సారాంశం

మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. 

మంచిర్యాల: అభం శుభం తెలియని మైనర్ బాలికను ప్రేమ పేరిట నమ్మించి లోబర్చుకున్నాడో యువకుడు. పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. దీంతో విషయం బైటపడటంతో యువకుడితో పాటు అతడి సోదరులు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  

మంచిర్యాల జిల్లా మేనపల్లి మండలం  నీల్వాయి గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమపేరుతో వెంటపడి బాలికను నమ్మించాడు. అతడి మాటల మాయలో పడ్డ బాలిక చనువుగా వుండేది. ఈ క్రమంలోనే బాలికపై పలుమార్లు బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

read more  వరంగల్ లో దారుణం: అమ్మమ్మ ఎదుటే మూగ యువతిపై గ్యాంగ్ రేప్ 

అయితే తాజాగా బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చి అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయగా సందీప్ తో ప్రేమ గురించి బయటపెట్టింది.  

తమ కూతురికి మాయమాటలు చెప్పి సందీప్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సందీప్‎ తో పాటు అతడికి సహకరించిన సోదరులు ప్రశాంత్, సంతోష్‎లపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు