మద్యం మత్తులో కన్న తల్లిపై లైంగిక వేధింపులు.. చివరకు..!

Published : May 24, 2021, 08:27 AM IST
మద్యం మత్తులో కన్న తల్లిపై లైంగిక వేధింపులు.. చివరకు..!

సారాంశం

కన్న తల్లి అనే కనికరం లేకుండా వ్యవహరించాడు. తల్లినే లైంగికంగా వేధించాడు. ఇన్నాళ్లు కొడుకు చేస్తున్న తప్పులను భరిస్తూ వచ్చిన ఆమె... ఈసారి మాత్రం భరించలేకపోయింది

కొడుకు బాధ్యత లేకుండా తిరుగుతున్నా భరించింది. రోజూ తాగివచ్చి తనను కొడుతున్నా సహించింది. కానీ.. ఈసారి ఆ కొడుకు మితిమీరి ప్రవర్తించాడు. పీకలదాకా తాగి.. ఆ మైకంలో ఏం చేస్తున్నామనే సోయి కూడా లేకుండా ప్రవర్తించాడు. కన్న తల్లి అనే కనికరం లేకుండా వ్యవహరించాడు. తల్లినే లైంగికంగా వేధించాడు. ఇన్నాళ్లు కొడుకు చేస్తున్న తప్పులను భరిస్తూ వచ్చిన ఆమె... ఈసారి మాత్రం భరించలేకపోయింది. కొడుకునే చంపేసింది. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తకోట మండలం రామకృష్ణాపురానికి చెందిన హరిజన్ నాగమ్మకు 25 సవత్సరాల క్రితమే పెళ్లైంది. ఒక కొడుకు శివ(25), కూతురు అంజలి ఉన్నారు. అయితే.. భర్తతో మనస్పర్థలు రావడంతో పిల్లలను తీసుకొని దూరంగా నివసిస్తోంది. కూతురు అంజలికి వివాహం చేసి అత్తారింటికి పంపింది. కుమారుడు శివ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, హమాలీగా పనిచేస్తున్నాడు. 

అయితే శివ ఇటీవల మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లడం లేదు. తరచూ తల్లిని, అమ్మమ్మను దూషించడంతో పాటు కొడుతుండేవాడు. అలాగే తల్లిని లైంగికంగానూ వేధించసాగాడు. దీంతో అతడి ప్రవర్తనకు తట్టుకోలేక ఎలాగైనా అంతమొందించాలని నాగమ్మ, బుచ్చమ్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన రాత్రి గాఢ నిద్రలో ఉన్న శివను తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి.. తర్వాత పక్కనే ఉన్న చెట్టుకు కట్టి కత్తితో పొడిచి చంపేశారు.

అయితే.. శివ కనిపించకుండా పోవడం.. పనికి కూడా రాకపోవడంతో అతని స్నేహితులకు అనుమానం కలిగింది. అందరూ ప్రశ్నిస్తుంటంతో.. సమాధానం చెప్పే క్రమంలో తడపడింది.  చివరకు తాను చేసిన నేరం అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?