తెలంగాణ: శాంతిస్తోన్న కరోనా, భారీగా తగ్గుదల.. 2 వేలకు పడిపోయిన కేసులు

Siva Kodati |  
Published : May 23, 2021, 09:33 PM IST
తెలంగాణ: శాంతిస్తోన్న కరోనా, భారీగా తగ్గుదల.. 2 వేలకు పడిపోయిన కేసులు

సారాంశం

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటల్లో 42,526 నమూనాలను పరీక్షించగా 2,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 5,53,277కి చేరింది.

ఇవాళ కొత్తగా మరో 19 మంది మహమ్మారికి బలవ్వగా.. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 3125కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40,489 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌‌లో తెలిపింది. ఇవాళ 4,693 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు తెలంగాణలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 343 మందికి పాజిటివ్‌గా తేలింది. 

Also Read:కరోనా మృత్యుఘోష... గంటల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

ఇక జిల్లా వారిగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 42, జగిత్యాల 71, జనగామ 16, జయశంకర్ భూపాల్‌పల్లి 20, జోగులాంబ గద్వాల్ 63, కామారెడ్డి 12, కరీంనగర్ 165, ఖమ్మం 123, కొమరంభీం ఆసిఫాబాద్ 13, మహబూబ్‌నగర్ 134, మహబూబాబాద్ 57, మంచిర్యాల 46, మెదక్ 20, మేడ్చల్ మల్కాజ్‌గిరి 146, ములుగు 16, నాగర్‌కర్నూల్ 57, నల్గొండ 32, నారాయణ్ పేట్ 23, నిర్మల్ 7, నిజామాబాద్ 30, పెద్దపల్లి 50, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 174, సంగారెడ్డి 83, సిద్దిపేట 94, సూర్యాపేట 63, వికారాబాద్ 87, వనపర్తి 55, వరంగల్ రూరల్ 61, వరంగల్ అర్బన్ 87, యాదాద్రి భువనగిరిలో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్