వదినను చంపేసి శవాన్ని పొలానికి తరలించి కాల్చేశాడు

Published : May 24, 2021, 07:04 AM IST
వదినను చంపేసి శవాన్ని పొలానికి తరలించి కాల్చేశాడు

సారాంశం

ఓ వ్యక్తి తన వదినను ఆమె ఇంట్లోనే చంపేసి శవాన్ని పొలానికి తరలించి కాల్చేశాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో శనివారంనాడు జరిగింది.

సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి ఓ వ్యక్తి తన వదినను ఆమె ఇంట్లో హత్య చేశాడు. శవాన్ని పొలానికి తరలించి కాల్చేశాడు. ఈ సంఘటన శనివారంనాడు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో చోటు చేసుకుంది. 

రామాపురంలోని తన ఇంట్లో రేఖ బయ్యమ్మ (55) ఒంటరిగా ఉంటోంది. అయితే, పాతకక్షల కారణంగా రేఖ సైదులు అనే వ్యక్తి తన వదినను హత్య చేశాడు. పథకం ప్రకారం హత్య చేసి బట్టవానికుంట సమీపంలో ఆమె పొలం వద్దకు ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లి కాల్చివేశాడు. 

ఆ తర్వాత అతను పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. 2004లో రేఖ సైదులు సోదరుడు రేఖ పచ్చియ్య హత్యకు గురయ్యాడు. తనపై అన్యాయంగా ఆ హత్య కేసును మోపారని, దాంతో తాను మూడు నెలలు జైలులో ఉన్నానని రేఖ సైదులు మండిపడుతూ వచ్చాడు. దాంతో కక్ష కట్టి వదినను హత్య చేశాడు. 

ఇటీవలి కాలంలో ఇంటి స్థలం, పొలం విషయాల్లో తరుచుగా గొడవ జరుగుతోందని, దాంతో తన తల్లి బయ్యమ్మను హత్య చేశారని, కూతురు కవిత చెప్పాడు. హుజూర్ నగర్ సీఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు బయ్యమ్మ కూతురు కవిత ఫిర్యాదు మేరకు రేక సైదులు, భార్య ఎల్లమ్మ, ఇద్దరు కుమారులు ఉపేందర్, హేమంత్ ల మీద కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu