బతుకమ్మ ఆడుతున్న భార్యపై ఇనుపరాడ్ తో దాడి చేసి, హత్య చేసిన భర్త..

By SumaBala BukkaFirst Published Sep 26, 2022, 7:17 AM IST
Highlights

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను బతుకమ్మ ఆడుతుండగా హత్య చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో కలకలం రేపింది. 

సిద్దిపేట : తన భార్య మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోందంటూ కక్ష పెంచుకున్న భర్త బతుకమ్మ ఆడుతున్న ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా వీరాపూర్ లో జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం..  గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్ రెడ్డి  దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్దకూతురు మంగను స్థానికుడైన ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. నెలరోజులకే మంగ ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని చనిపోవడంతో మరల రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే జరిగింది. తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా... ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుపరాడ్ తో బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్ల విక్రయం: ముగ్గురి అరెస్ట్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఆగస్ట్ లో కరీంనగర్ లో కరీంనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేళ విషాదాన్ని నింపింది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించారో, ఒప్పించారో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ముద్దులొలికే చిన్నారులూ ఉన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ వారి మధ్య ప్రేమ ఆవిరైపోయి, ద్వేషం రగిలింది. ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేంతగా ప్రేమించుకున్నవారే... ప్రాణాలు తీసుకునేలా తయారయ్యారు. 

జాతీయ జెండా సాక్షిగా భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష (30) 11యేళ్ల కిందట ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్వాడిలో ఆయాగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబకలహాలు జరుగుతున్నాయి. దీంతో శిరీష భర్తకు దూరంగా కేశవపట్నంలోనే ఉంటుంది. విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించింది.

ఆగస్ట్ 15న అంగన్వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొంది. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకు వెళ్ళాడు. జనం అంతా చూస్తూ ఉండగానే కత్తితో గొంతు కోయడంతో.. ఆమె ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్ అనే యువకుడు అడ్డుకోగా.. అతడిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో అతడికి  చిన్న గాయం అయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో… వారు అక్కడికి చేరుకునేసరికే నిందితుడు పరారీలో ఉన్నాడు. 

click me!