అయ్యా జగ్గయ్య ఇంతకీ నువ్వే పార్టీ : జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల సెటైర్లు

Siva Kodati |  
Published : Sep 25, 2022, 09:33 PM IST
అయ్యా జగ్గయ్య ఇంతకీ నువ్వే పార్టీ : జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల సెటైర్లు

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సెటైర్లు వేశారు వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల . అయ్యా జగ్గయ్య, నేను బీజేపీ వదిలిన బాణం కాదు.. వైఎస్సార్ వదిలిన బాణమని ఆమె పేర్కొన్నారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కౌంటరిచ్చారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట, ఈయన ఇప్పుడు ఏ పార్టీలో వున్నారని ప్రశ్నించారు. మొదట టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అంటూ షర్మిల చురకలు వేశారు. రోజో పార్టీ మారితే ఎలా జగ్గారెడ్డి అని ఆమె సెటైర్లు వేశారు. తాను బీజేపీ వదిలిన బాణం అన్నారు ఈ జగ్గయ్య.. అయ్యా జగ్గయ్య, నేను బీజేపీ వదిలిన బాణం కాదన్నారు షర్మిల. తాను వైఎస్సార్ వదిలిన బాణమని ఆమె పేర్కొన్నారు. 

అంతకుముందు తన తండ్రి వైఎస్ఆర్ ను కుట్ర చేసి చంపారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ తరహలోనే తనను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ బిడ్డను, నాకు భయం లేదన్నారు. తాను పులి బిడ్డను అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ఆమె కేసీఆర్ ను కోరారు.  తనను ఎదుర్కోలేక స్పీకర్ కు పిర్యాదు చేశారని ఆమె మండిపడ్డారు. తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారన్నారని ఆమె ఆరోపించారు. 

ALso Read:కుట్ర చేసి వైఎస్ఆర్ ను చంపారు, నన్ను కూడా ...: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలనం

బేడీలకు తాను భయపడబోనని తేల్చి చెప్పారు. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని  ప్రశ్నిస్తే తప్పా అని ఆమె అడిగారు. తన విమర్శలకు సమాధానం చెప్పుకోలేక తనపై స్పీకర్ కి పిర్యాదు చేశారన్నారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు చూపలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. 8 ఏళ్లుగా ప్రాజెక్ట్ పూర్తి చేయక పోతే ఐకమత్యం చూపించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు. ఈ పాలమూరు ప్రాజెక్ట్ దక్షిణ తెలంగాణ కి ఎంతో కీలకమని.... జిల్లాకు చెందిన  ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి అటక ఎక్కించారని షర్మిల ఆరోపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?