ఎంపీటీసీలు, జడ్పీటీసీలంటే అంత చులకనా?.. మండలిలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

By AN TeluguFirst Published Sep 28, 2021, 9:45 AM IST
Highlights

ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలకు నిధుల కొరత, వారికి సరైన గౌరవం లేకపోవడం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కవిత మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎన్నుకోబడిన మండల పరిషత్ అధ్యక్షులకు శాశ్వత కార్యాలయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (LC Kalvakuntla Kavitha)శాసనమండలి(Legislative Council)లో సోమవారం చేసిన తొలి ప్రసంగం రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ప్రసంగంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల (MPTCs and ZPTCs)దయనీయ పరిస్థితిని వివరించారు, వారికి న్యాయం జరిగేలా చూడాలని పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని కోరారు. 

ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలకు నిధుల కొరత, వారికి సరైన గౌరవం లేకపోవడం కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కవిత మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎన్నుకోబడిన మండల పరిషత్ అధ్యక్షులకు శాశ్వత కార్యాలయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలలో సర్పంచ్‌లతో పాటు ఎన్నికైన ఎంపీటీసీలు కూర్చొని, విధులు నిర్వర్తించడానికి సరైన స్థలం లేదని, దీనివల్ల వారు అవమానానికి గురవుతున్నారని అన్నారు. 

ప్రసంగంలో భాగంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. పంచాయితీ రాజ్ మంత్రిని అడ్రస్ చేశారు. పంచాయతీ రాజ్ మంత్రి MPTCల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, వారి విధులను నిర్వర్తించడానికి వీలుగా కనీసం కుర్చీలను అందించాలని ఆమె కోరారు. ఎంపీటీసీలు, జెడ్‌పిటిసిలు గ్రామ పంచాయతీలలో అధికారిక కార్యక్రమాల సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసేలా అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరారు.

15 వ ఆర్థిక సంఘం గ్రామ పంచాయతీలకు రూ .500 కోట్ల మేరకు నిధులను తగ్గించినప్పటికీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అదనంగా రూ .500 కోట్లు మంజూరు చేయడం ద్వారా పరిహారం చెల్లించారని చెప్పుకొచ్చారు. దీనిమీద జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు ప్రశంసించారని గుర్తు చేశారు.

కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న ప్రతినిధుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి ఆమె ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.

Cyclone Gulab: నేడు తెలంగాణలో భారీ వర్షాలు... ఆ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

మరోవైపు,  MPTC లు, ZPTC లు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు నిధులు మంజూరు కావడం లేదని, గౌరవం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఎంపీటీసీలకు నిధులు, విధులను కోరినప్పుడు తెలంగాణలో MPTC/ ZPTC వ్యవస్థను రద్దు చేస్తానని బెదిరించారని ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు విరుచుకుపడ్డారని.. దానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక మహిళా MPTC ఇటీవల పోస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో..కవిత వ్యాఖ్యలపై స్పందించిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆమె లేవనెత్తిన అన్ని సమస్యలను పరిశీలించి వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయితీలకు నిధులను విడుదల చేస్తోందని, ఏప్రిల్ నుండి ప్రతి నెలా రూ. 227 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు గ్రామ పంచాయతీలకు రూ .1,365 కోట్లు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

click me!