భుజాలపై చెయ్యేశాడు,బూతులు తిట్టాడు:రసమయిపై ఎస్పీకి మహిళ ఫిర్యాదు

By Nagaraju TFirst Published Nov 6, 2018, 3:35 PM IST
Highlights

 మానకొండూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రసమయి తమను అసభ్యకరంగా దూషించారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ మహిళ. 

ఇల్లంతకుంట: మానకొండూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రసమయి తమను అసభ్యకరంగా దూషించారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఓ మహిళ. 

మానకొండూర్ నియోజకవర్గం అభ్యర్థిగా తిరిగి టిక్కెట్ దక్కడంతో రసమయి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో రసమయికి స్వాగతాల కంటే నిరసనలే సెగలే స్వాగతం పలుకుతున్నాయి. 

ప్రజల నుంచి ఊహించని స్థాయిలో నిరసనలు వస్తుండటంతో రసమయి కొన్ని సందర్భాల్లో ప్రచారాన్ని రద్దు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. దాదాపు చాలా సార్లు అనేక గ్రామాల ప్రజలు తిరగబడటంతో రసమయి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. 

నవంబర్ 4న ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు గత హామీలపై నిలదీశారు. 

దీంతో సహనం కోల్పోయిన రసమయి బాలకిషన్ మహిళలపై అసభ్యపదజాలంతో దూషించారనని కందికట్కూర్ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేసింది. మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటంతో పాటు భుజాలపై చేతులు వేసి చెప్పరాని విధంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన రసమయిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రసమయి దుర్భాషలకు సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ లను ఎస్పీకి జతపరచారు. జ్యోతితోపాటు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, జ్యోతితోపాటు ఎస్పీని కలిశారు.

ఈ వార్తలు కూడా చదవండి

రసమయికి చేదు అనుభవం: 4 ఏళ్లలో ఏం చేశావని నిలదీత

మరోసారి రసమయి బాలకిషన్ కు చేదు అనుభవం

రసమయికి చేదు అనుభవం​​​​​​​

click me!