లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ.. భార్యకు వేధింపులు..!

Published : Jul 02, 2021, 07:35 AM IST
లావుగా ఉన్నావ్.. అందంగా లేవంటూ.. భార్యకు వేధింపులు..!

సారాంశం

అప్పటి నుంచి అందంగా లేవంటూ.. మరో పెళ్లి చేసుకుంటానంటూ కొన్నాళ్లుగా హాసిఫ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.


ముందు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు.  కానీ.. పెళ్లి తర్వాత నుంచి వేధించడం మొదలుపెట్టాడు. నువ్వు లావుగా ఉన్నావు.. అస్సలు అందంగా లేవు.. నేను మరో పెళ్లి చేసుకుంటా అంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులకు..  అత్తమామ కూడా మద్దతుగా నిలిచారు. వీరి వేధింపులు తట్టుకోలేక ఆ భార్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అమీర్ పేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నారాయణఖేడ్ కు చెందిన హలీమాబేగం(25)కు బోరబండ స్వరాజ్ నగర్ కు చెందిన అబ్దుల్ హాసిఫ్(32) తో 2018 జూన్ లో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అప్పటి నుంచి అందంగా లేవంటూ.. మరో పెళ్లి చేసుకుంటానంటూ కొన్నాళ్లుగా హాసిఫ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

భర్త వేధింపులకు.. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్ జానీమియా సైతం సూటిపోటి మాటలు అనేవారు. ఈ విషయాన్ని హలీమా తన పుట్టింటి వారికి తెలియజేసింది. విడాకులు ఇవ్వమని ఒత్తిడిచేయడం మొదలుపెట్టారని.. ఈ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పింది. దీంతో.. మరుసటి రోజు వచ్చి కూతురిని తీసుకొని పోదామని అనుకుంది. కానీ.. ఆలోపే హలీమా బేగం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Business Ideas : తెలుగు మహిళలకు లక్కీ ఛాన్స్.. చేతిలో రూపాయి లేకున్నా ప్రభుత్వమే బిజినెస్ పెట్టిస్తుంది, నెలనెలా రూ.40 వేల ఆదాయం
BR Naidu Speech at Kondagattu Temple: పవన్ వల్లే కొండగట్టులో అభివృద్ధి పనులు | Asianet News Telugu