జలవివాదంపై ఏపీ ఫిర్యాదులు: తెలంగాణకు షాక్.. ఆ నీటిని మినహాయిస్తూ కేఆర్ఎంబీ ఆదేశాలు

By Siva KodatiFirst Published Jul 2, 2021, 1:25 AM IST
Highlights

జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డ్ స్పందించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

జల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డ్ స్పందించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్‌సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ కేటాయింపుల నుంచి విడుదల చేసిన నీటిని తగ్గించుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు కేఆర్ఎంబీ సూచించింది.

వచ్చే సమావేశం నాటికి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని కేఆర్ఎంబీ తెలంగాణను ఆదేశించింది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read:కృష్ణా జల వివాదం.. జోక్యం చేసుకోండి: మోడీ, జలశక్తి మంత్రులకు జగన్ లేఖలు

అంతకుముందు తెలంగాణతో జలవివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖలు రాశారు. జల జగడంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. కేఆర్ఎంబీ పరిధిని ఫిక్స్ చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌ల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని జగన్ కోరారు.

అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ వాడుకుంటున్న నీటిని నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు ఉల్లంఘించిందని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. తెలంగాణ ఉల్లంఘనలపై గతంలో కేఆర్ఎంబీకి రాసిన లేఖలను ముఖ్యమంత్రి జగన్ జతపరిచారు. 

click me!