దర్భాంగా పేలుళ్ల కేసు: హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు.. ఇమ్రాన్ ఇంటిలో పేలుడు పదార్ధాలు లభ్యం

By Siva KodatiFirst Published Jul 1, 2021, 9:29 PM IST
Highlights

దర్భాంగా పేలుళ్ల కేసు నేపథ్యంలో హైదరాబాద్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇమ్రాన్, నాసిర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే యూపీకి చెందిన ఇమ్రాన్, నసీర్‌లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది

దర్భాంగా పేలుళ్ల కేసు నేపథ్యంలో హైదరాబాద్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇమ్రాన్, నాసిర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే యూపీకి చెందిన ఇమ్రాన్, నసీర్‌లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ఇంట్లో పెద్ద మొత్తంలో ఐఈడీ పేలుడు పదార్థాలను ఎన్ఐఏ సీజ్ చేసింది. అలాగే ఇద్దరి ఇళ్లలోనూ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

కాగా, దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు హైద్రాబాద్ లో  అరెస్టైన ఇద్దరు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది. హైద్రాబాద్ నగరంలోని నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లకు పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇద్దరు ఉగ్రవాదులను రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కీలక విషయాలను పొందుపర్చింది. హైద్రాబాద్ నగరంలో రెడీమెడ్ బట్టల వ్యాపారం చేస్తున్నారు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ లు . 2012లో నాసిర్ మాలిక్  పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. పాకిస్తాన్ లో  ఉగ్రవాది ఇక్బాల్ తో నాసిర్  మాలిక్ కు సంబంధం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన వారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

Also Read:దర్బాంగా రైల్వేస్టేషన్ పేలుడు ఘటన: మూడో వ్యక్తి ప్రమేయంపై హైద్రాబాద్‌లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్

యూపీకి చెందిన మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్ధాల తయారీలో కూడ నాసిర్ మాలిక్ శిక్షణ పొందినట్టుగా ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పాకిస్తాన్ కు చెందిన  ఇక్బాల్ ఆదేశాల మేరకు దేశంలో భారీ పేలుళ్లకు హైద్రాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులు ప్లాన్ చేశారు.పేలుడుకు సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ వాడినట్టుగా నిందితులు ఈ విచారణలో వెల్లడించారు. రసాయనాల బాంబులను పార్శిల్ లో  దుస్తులమధ్యలో ఉంచి పార్శిల్ ను పంపారు. 16 గంటలలోపుగా ఈ బాంబు పేలేలా ప్లాన్ చేశారనీ ఈ రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు.

click me!