పాత మిత్రుడు.. పెళ్లి తర్వాత ఫేస్ బుక్ లో పలకరింపు.. చివరకు..

By telugu news team  |  First Published Feb 29, 2020, 8:00 AM IST

అప్పటి నుంచి  కార్తీక్... రాగసుధని వేధించడం మొదలుపెట్టాడు. అతని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి వేధించేవాడు.ఉన్నట్లుండి కార్తీక్  ఒక రోజు కనిపించకుండా పోయాడు. అతని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వగా...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఆమెకు వివాహమైంది.ఓ బాబు కూడా ఉన్నాడు. ఆనందంగా జీవితం సాగుతోందని ఆమె అనుకునేలోపు... ఫేస్ బుక్ వేదికగా పాత మిత్రుడు ఒకరు పలకరించాడు. తెలిసిన వాడే కదా అని ఆమె కూడా అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. తొలుత బాగానే మాట్లాడిన ఆ మిత్రుడు తర్వాత అతిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.  చివరకు ఆ యువకుడు హత్యకు గురవ్వగా... సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన  మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన రాగసుధ(29)కు పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడు. గతంలో గద్వాలలో కార్తీక్ అనే యువకుడు ఆమెతోపాటు డిగ్రీ చదువుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఫేస్ బుక్ లో  కలిశాడు. కొద్ది రోజులు స్నేహంగా మెలిగిన రాగసుధ అతని ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసింది.

Latest Videos

Also Read అత్తాపూర్ కేసు: నడిరోడ్డుపై దారుణ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు...

అప్పటి నుంచి  కార్తీక్... రాగసుధని వేధించడం మొదలుపెట్టాడు. అతని తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి వేధించేవాడు.ఉన్నట్లుండి కార్తీక్  ఒక రోజు కనిపించకుండా పోయాడు. అతని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వగా...కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి.

కార్తీక్  తలపగలకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు తెలిసింది. ఎవరు చంపారా అని ఆరా తీస్తుండగా... రాగసుధ ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు తెలిసింది. వీరిద్దరి మృతికి సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. రాగసుధ కుటుంబ సభ్యులే కార్తీక్ ని చంపినట్లు అనుమానిస్తున్నారు.

click me!