అది ఔదార్యం కాదు సురభి నాటకం: వృద్ధుడికి కేసీఆర్ సాయంపై రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 28, 2020, 8:38 PM IST
Highlights

గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ టోలీచౌకీలోని ఓ వికలాంగుడికి డబుల్ బెడ్‌రూం, పెన్షన్ మంజూరు చేసి ఔదార్యం చూపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ టోలీచౌకీలోని ఓ వికలాంగుడికి డబుల్ బెడ్‌రూం, పెన్షన్ మంజూరు చేసి ఔదార్యం చూపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.

పట్నంగోస కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

Also Read:ఔదార్యం చాటుకున్న కేసీఆర్: వృద్ధుడి కోసం కారు దిగి.. సమస్య పరిష్కారం

అనంతరం రేవంత్  మాట్లాడుతూ.. కేసీఆర్‌ది పెద్ద నాటకమని, కొడుకు ఊర్లు తిరుగుతుంటే తండ్రి హైదరాబాద్‌లో సురభి నాటకాన్ని తలపిస్తున్నట్లు ఉందని రేవంత్ ఆరోపించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్‌లో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు.

వాటిపైన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కైతలాపూర్‌లోని 140 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు ముందుగా స్థానిక నివాసితులకు అందించాలని రేవంత్ కోరారు. రెండు నెలల్లో వీటిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడించి అక్కడే నిరసన వ్యక్తం చేస్తామని ఎంపీ హెచ్చరించారు. 

గురువారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్తుండగా మార్గమాధ్యంలో టోలీచౌకి మీదుగా వస్తున్నారు.

ఈ క్రమంలో రోడ్డుపై వికలాంగుడైన ఓ వృద్దుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. అతనిని చూసిన ముఖ్యమంత్రి వెంటనే కారు దిగి పెద్దాయన దగ్గరకి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు.

తన పేరు మహ్మద్ సలీమ్ అని పరిచయం చేసుకున్న అతను గతంలో తాను డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి జారీపడటంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాలేదని, ఉండటానికి ఇల్లు కూడా లేదని సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.

Also Read:రేవంత్ కు గోపనపల్లి భూముల ఉచ్చు: వెనుక కథ ఇదీ

అతని బాధ చూసి చలించిపోయిన కేసీఆర్ వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని సీఎం ఆదేశించారు.

కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కలెక్టర్ టోలిచౌకిలోని సలీమ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడిని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ జారీ చేసి పెన్షన్ మంజూరు చేశారు. అలాగే జియాగూడలో డబుల్ బెడ్‌రూమ్ సలీం కుమారుడికి ప్రభుత్వ ఖర్చులతో వైద్య పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

click me!