అత్తాపూర్ కేసు: నడిరోడ్డుపై దారుణ హత్య.. ముగ్గురికి జీవిత ఖైదు

By Siva Kodati  |  First Published Feb 28, 2020, 7:00 PM IST

తెలంగాణలో సంచలనం సృష్టించిన అత్తాపూర్ హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అత్తాపూర్‌లో నడిరోడ్డుపై రమేశ్ అనే వ్యక్తిని విక్రమ్ సింగ్, లక్ష్మణ్‌గౌడ్, విక్రమ్‌లు దారుణంగా హత్య చేశారు. 


తెలంగాణలో సంచలనం సృష్టించిన అత్తాపూర్ హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అత్తాపూర్‌లో నడిరోడ్డుపై రమేశ్ అనే వ్యక్తిని విక్రమ్ సింగ్, లక్ష్మణ్‌గౌడ్, విక్రమ్‌లు దారుణంగా హత్య చేశారు. 

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2017 డిసెంబర్ 24వ తేదీ రాత్రి మహేష్‌ గౌడ్‌ను రమేష్ తన స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.  జుమ్మరాత్ బజార్‌కు చెందిన పురోహిత్ మహేష్‌గౌడ్‌ బేగంబజార్‌లోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడు.

Latest Videos

undefined

2017 డిసెంబర్ 24వ తేదీన మహేష్‌గౌడ్‌ను... రమేష్‌ మరికొందరు స్నేహితులతో కలిసి కడ్తాల్ మైసిగండికి తీసుకెళ్లాడు. కారులోనే మహేష్‌గౌడ్‌ను హత్య చేసిన రమేష్ అతని స్నేహితులు అనంతరం శవాన్ని పెట్రోల్ పోసి దగ్థం చేశారు. 

Also Read:అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

రమేష్, మహేష్‌లు ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. అయితే తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో రమేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో ఆమెతో మహేష్‌ కూడా చనువుగా ఉండేవాడు. ఈ విషయమై మహేష్, రమేష్ మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో వివాహిత భర్తకు ఈ విషయం తెలిసి అక్కడి నుండి  మరోచోటకు కాపురాన్ని మార్చాడు.

మహేష్‌పై కోపంగా ఉన్నా కానీ రమేష్ మాత్రం కోపాన్ని అణచుకొన్నాడు. కానీ పైకి మాత్రం మహేష్‌తో స్నేహాన్ని నటించాడు. నమ్మించి మహేష్ ను తీసుకెళ్లిన రమేష్ కారులోనే హత్య చేశాడు.

అయితే కారులోనే మహేష్‌ను హత్య చేయడంతో అందులో రక్తం మరకలున్నాయి. కారును రమేశ్ సర్వీసింగ్ ఇవ్వడంతో సర్వీసింగ్ సెంటర్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేష్ గౌడ్ హత్య విషయం వెలుగు చూసింది.

Also Read:అత్తాపూర్ మర్డర్: 'కొడుకా.. నీ వద్దకే రమేష్‌ను పంపా'

ఈ కేసు విచారణలో భాగంగా ఉప్పర్‌పల్లి కోర్టుకు రమేష్ తరచుగా హాజరౌతున్నాడు. 2018 సెప్టెంబర్ నెలలో  రమేష్ ఎక్కడి నుండి కోర్టుకు వస్తున్నాడు...ఎలా వెళ్తున్నాడనే విషయాన్ని మహేష్ తండ్రి రెక్కీ నిర్వహించాడు. ఈ రెక్కీ ఆధారంగా కోర్టు నుండి వెళ్తున్న రమేష్‌ను 2018 సెప్టెంబర్‌లో మహేష్ తండ్రి అత్తాపూర్‌లోని పిల్లర్ నెం 143 వద్ద గొడ్డలితో నరికి చంపాడు.

కొడుకును హత్య చేసిన రమేష్‌పై కక్షకట్టిన మహేష్ తండ్రి.. అదను కోసం ఎదురుచూసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత  నిందితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

click me!